/rtv/media/media_files/2025/02/25/l1aYEDItuNQy2jzA6KsG.jpg)
Three Language Formula Photograph: (Three Language Formula)
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా అమలు గురించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్లరంగు పూస్తున్నారు. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు సహా పలు చోట్ల ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలను నల్లరంగుతో కనిపించకుండా చేశారు. అంతేకాదు త్రి భాష విధానాన్ని వ్యతిరేఖిస్తూ మంగళవారం బీజేపీ పార్టీ నాయకురాలు రంజన నాచియార్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది.
🙏@BJP4TamilNadu @annamalai_k @KesavaVinayakan @blsanthosh pic.twitter.com/rkFMplsjA2
— Ranjana Natchiyaar (@RanjanaNachiyar) February 25, 2025
ఇది కూడా చదవండి: Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!
డీఎంకే కార్యకర్తలు ఆదివారం, సోమవారాల్లో పాలక్కాడ్, పాలైయంకోట్టై రైల్వే స్టేషన్‌లోని బోర్టులపై హిందీ పేర్లకు బ్లాక్ పెయింట్ వేశారు. చెన్నైలోని అలందూర్ పోస్టాఫీస్, జీఎస్టీ రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని సైన్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలకు నల్లరంగు పూశారు.
ఇది కూడా చదవండి: Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్!
హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధికార డీఎంకేపై బీజేపీ మండిపడింది. తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిభాషా విధానంపై డీఎంకే వైఖరి కుట్ర అని విమర్శించారు. వారి సొంత పిల్లలు మల్టీ లాంగ్వేజ్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు త్రిభాషా విధానాన్ని డీఎంకే నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. డీఎంకే పార్టీ వారికో న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయం చెబుతుందా అని అని ఎక్స్‌లో ఆరోపించారు.
The DMK’s dangerous hypocrisy unmasked and exposed by our @BJP4TamilNadu President, @annamalai_k ji. The DMK has a dubious two language policy- one for the private govt schools and another one which victimises the govt school students. DMK’s divisive federalism will fail. https://t.co/Xqh3xZJmoV
— C.R.Kesavan (@crkesavan) February 24, 2025