Mahakumbh: శివరాత్రి పర్వదినాన కిక్కిరిసిన కుంభమేళా.. ప్రయాగ్‌రాజ్ ఆఖరిరోజు విశేషాలివే..!

45రోజుల కుంభమేళా శివరాత్రి ఆఖరిరోజు కావడంతో త్రివేణి సంగమానికి భారీగా భక్తులు చేరుకున్నారు. శివరాత్రి కాబట్టి బుధవారం కుంభమేళా కిక్కిరిసిపోయింది. అమృత స్నానాలు చేసిన భక్తులపై పూల చల్లారు. ఈ రోజు ప్రయాగ్‌రాజ్‌లో సూపర్ విజువల్స్ ఆర్టికల్‌లో చూడండి.

New Update
kumbhamela last day

kumbhamela last day Photograph: (kumbhamela last day )

65 కోట్ల మంది పాపాలు కడిగేసిన త్రివేణి సంగమం.. ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఫిబ్రవరి26(శివరాత్రి)తో ఆఖరి రోజు. ఇలాంటి మహా కుంభమేళా మళ్లీ 144 ఏళ్ల తర్వాత వస్తుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు మహాకుంభమేళా నిర్వహించారు. గంగా, యమునా, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించానికి ఇదే చివరి రోజు కావడంతో లక్షలాది మంది ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. దీంతో కుంభమేళా కిక్కిరిసింది. శివుడికి ఇష్టమైన మహా శివరాత్రి రోజు సంగమంలో అమృత స్నానాలు చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులు. దీంతో సెలబ్రెటీలు సైతం ఇదే రోజు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. శివనామస్మరణాలతో కుంభమేళా మారుమోగింది. హర హర మహాదేవ్.. శంభో శంకర అంటూ సాధువులు, హింధూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్ రాజ్‌కుంభమేళా ఏర్పాట్ల కోసం రూ.7500 కోట్లు కేటాయించింది. కుంభమేళా నిర్వహిచడం వల్ల ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆ రాష్ట్రంలో 2 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ నాలుగు పవిత్ర స్థలాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాలా నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి కాకుండా 144 ఏళ్లకు జరిగే ఈ మహా కుంభమేళాకి చాలా ప్రత్యేకత ఉంది.  

బిజెపికి చెందిన సువేందు స్వామి కుంభమేళాపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చరిత్రలో  మాస్టర్స్ డిగ్రీ చేసిన మమతా బెనర్జీకి మహా కుంభమేళా ప్రాధాన్యత తెలియాదా అని ప్రశ్నించారు. ఆమె రాజకీయ లబ్ధి కోసం ప్రయాగ్‌రాజ్‌పై ఏవేవో ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.

బుధవారం కుంభమేళా భక్తులపై హెలికాఫ్టర్‌లో పూల వర్షం కురిపించారు. సాక్షాత్తు శివుడే తమని ఆశీర్వదించినట్లు సంగమంలో స్నానమాచరించిన భక్తులు పులకరించిపోయారు.

కుంభమేళాలో అమృస్నానాలు ఆచరించలేకపోయిన కుటుంబసభ్యులను వీడియో కాల్‌లోనే పవిత్ర గంగా జలాల్లో తడుపుతున్నారు కొందరు భక్తులు. ఫోన్‌లో వీడియో కాల్ చేసి మొబైల్ సంగమంలో మూడుసార్లు ముంచుతున్నారు.

అభిమానులు కూడా తమ హీరోల ఫొటోలు త్రివేణి సంగమ నీటిలో తడుపుతున్నారు. రామ్ పోతినేని, ప్రభాస్ పేర్లు, ఫోటోలతో ఉన్న టీ షర్టులు ప్రయాగ్‌రాజ్ సంగమంలో ముంచుతున్నారు ఫ్యాన్స్.

బ్రెజిల్, మెక్సికో నుంచి కూడా కుంభమేళా సంగమానికి చేరుకున్నారు ఈ రోజు భక్తులు. ప్రయాగ్‌రాజ్‌లో వారి అనుభూతి గురించి పంచుకున్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త, సినీ సెలబ్రెటీ ప్రీతి జింటా శిరాత్రి రోజు ఫ్లైట్‌లో కుంభమేళా చేరుకొని అమృత స్నానాన్ని ఆచరించింది. ఆమె ఎక్స్ అకౌంట్‌లో ప్రయాగ్‌రాజ్‌లోని మెమెరీస్ వీడియో షేర్ చేసింది.

పోలీస్ అధికారులు సంగమంలో బోట్‌లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నదిలో ప్రయాణిస్తు పెట్రోలింగ్ చేస్తూ భక్తులకు సూచనలు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాద్ మహాశివరాత్రి కుంభమేళా ఏర్పాట్లను గోరఖ్ నాథ్ టెంపుల్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. కుంభమేళాలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఆయన ఏర్పాట్లును, భక్తులను పర్యవేక్షిస్తున్నారు.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు