బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి వెనుక అండర్‌వరల్డ్ హస్తం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర హోంశాఖ దీనిపై క్లారిటీ ఇచ్చింది. సైఫ్ అలీఖాన్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని హోంశాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్ తెలిపారు. ఈ దాడి వెనుక క్రిమిల్ గ్యాంగ్స్ ప్రమేయం లేదన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
Also Read: సైఫ్ కేసులోకి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ఎంట్రీ.. వణికిపోతున్న ముంబై మాఫియా!
'' సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసినట్లుగా భావించిన ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ముఖానికి దగ్గరి పోలికలు ఉన్న ఈ యువకుడికి క్రిమినల్ చరిత్ర ఉంది. అయితే ఈ దాడిలో అతడికి సంబంధం లేదని గుర్తించాం. ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతోందని'' మంత్రి యోగేశ్ కదమ్ తెలిపారు. మరో వ్యక్తిని కూడా పోలీసులు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ దాడి వెనుక క్రిమినల్ గ్యాంగ్ ప్రమేయం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. అంతేకాదు ఇంతకుముందు ఏదైనా బెదిరింపు వచ్చినట్లు సైఫ్ నుంచి కూడా పోలీసులకు సమాచారం లేదని.. భద్రతను కూడా కోరలేదని తెలిపారు. ఒకవేళ సైఫ్ సెక్యూరిటీని కోరితే రూల్స్ ప్రకారం కల్పిస్తామన్నారు.
Also Read: ఏపీకి గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ
ఇదిలాఉండగా ఇప్పటికే సైఫ్ అలీఖాన్ శరీరంలో దిగిన పదునైన కత్తిని ఆస్పత్రి వైద్యులు బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన వెన్నుముకకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. ఐసీయూ నుంచి ఆయన్ని ప్రత్యేక రూమ్‌కు తరలించామని.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అయ్యే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు.
Also Read: రష్యా ఆర్మీలో 12 మంది ఇండియన్స్ మృతి, 16 మంది మిస్సింగ్