/rtv/media/media_files/2025/01/25/zvMjZ1kTEsLUdUPsbiD5.jpg)
Police medals Photograph: (Police medals)
Police Medals: గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా కేంద్ర హోం శాఖ పోలీసు శాఖకి సంబంధించి పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోలీసు, ఫైర్ సర్వీస్(Fire Service), హోంగార్డ్(Home Guard), సివిల్ డిఫెన్స్ అధికారులకు(Civil Defence Officers) గ్యాలంట్రీ పతకాలను అందజేయనుంది. దీనికి సంబంధించిన జాబితను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఈ గ్యాలంట్రీ పతకాలను మొత్తం 942 మందికి అందజేయనుంది. ఇందులో 95 మందికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికీ ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 101 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 746 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలను కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!
#Breaking 942 Personnel of Police, Fire, Home Guard & Civil Defence and Correctional Services awarded Gallantry/Service Medals on the occasion of the Republic Day, 2025.
— Jammu-Kashmir Now (@JammuKashmirNow) January 25, 2025
A total of 942 Personnel of Police, Fire, Home Guard & Civil Defence(HG&CD) and Correctional Services have… pic.twitter.com/quBv5ArB0B
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 12 మందికి..
పోలీస్ విశిష్ఠ సేవా(Police Medal for Meritorious Service) పతకాలకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 12 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్(Andra Pradesh) నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కడాలి అర్జునరావుకి పతకం దక్కగా.. వార్డర్ ఉండ్రాజవరపు వీరవెంకట సత్యనారాయణకు కూడా కరెక్షనల్ సర్వీస్ విభాగంలో పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. ఐపీఎస్ విక్రమ్‌సింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్‌రాజ్ రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలకు ఎంపిక కావడంతో పాటు మరికొందరు ఉన్నారు.
ఇది కూడా చూడండి: USA: స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..
ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా