/rtv/media/media_files/2026/03/12/gas-cylinder-2026-03-12-18-55-13.jpg)
Gas Cylinder
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. ఆ మార్గంలో వస్తున్న నౌకలపై దాడులు చేయడంతో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. భారత్‌లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరగడం దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సామాన్యుడిపై భారం మోపుతున్నారని మండిపడుతున్నాయి. అయితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలను పరిశీలిస్తే దీని ఆర్థిక వాస్తవాలు వేరేలా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: హర్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు చేరిన నౌక.. ఎలా వచ్చిందో తెలుసా ?
భారతదేశం తన LPG అవసరాల్లో దాదాపు 60 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. దీంతో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను నిర్ణయించే 'సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్' (Saudi CP) ప్రభావం భారత్‌పై ఉంటుంది. జూలై 2023లో మెట్రిక్ టన్నుకు $385 ఉన్న సౌదీ సీపీ.. నవంబర్ 2025 నాటికి $466కి చేరింది (దాదాపు 21 శాతం పెరిగింది). అంతర్జాతీయంగా ధరలు పెరిగినా.. కేంద్ర నిర్ణయం వల్ల అదే సమయంలో దేశీయంగా సిలిండర్ ధర రూ.1103 నుండి రూ. 853 కి (22 శాతం) తగ్గింది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చమురు రవాణాపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. హార్ముజ్ జలసంధి మార్గం ద్వారానే భారత్ 60 శాతం LPGని దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం ఆ మార్గంలో రవాణాకు అంతరాయం కలగడం, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరగడం వల్ల అంతర్జాతీయంగా ధరలు పెరిగిపోయాయి.
Also Read: ప్రేమంటే ఇదేరా.. కోట్లు వచ్చినా కోరుకున్న వాడినే పెళ్లాడిన మోనాలిసా!
ప్రస్తుతం ఒక సిలిండర్ సరఫరాకు అయ్యే ఖర్చు దాదాపు రూ. 950 నుంచి రూ. 1050 ఉంది. ఢిల్లీలో చూసుకుంటే రూ.913 కే సిలిండర్ అందుతోంది. అంటే ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలే ఈ వ్యత్యాసాన్ని భరిస్తున్నాయి. అంతర్జాతీయ ధరల ప్రకారం చూస్తే వాస్తవానికి సిలిండర్‌పై రూ.130 పెరగాల్సి ఉంది. కానీ కేంద్రం దాన్ని రూ.60 కే పరిమితం చేసింది. పొరుగు దేశాలతో పోలిస్తే కూడా భారత్‌లో ఎల్పీజీ ధరలు చాలా తక్కువగానే ఉన్నాయి.
భారత్ (ఢిల్లీ): రూ. 913
పాకిస్తాన్: సుమారు రూ. 1,046
నేపాల్: సుమారు రూ. 1,207
శ్రీలంక: సుమారు రూ. 1,241
నలుగురు ఉన్న ఓ సాధారణ కుటుంబం ఏడాదికి సగటున 4--5 సిలిండర్లు వాడుతుందని అనుకుంటే.. ఈ రూ.60 పెంపు వల్ల రోజువారీ భారం కేవలం 80 పైసలు మాత్రమే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబున్నాయి.
Follow Us