/rtv/media/media_files/2025/03/15/Iz91LoFTT4EBUKYdRJ7m.jpg)
Tesla Seeks Certification For Model Y And Model 3 To Enter Indian Market
భారత్‌లో టెస్లా కార్లు విక్రయించేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం టెస్లా.. సర్టిఫికేషన్ అండ్ హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. వాస్తవానికి విదేశాలకు చెందిన కార్లను దేశంలో అమ్మాలంటే సర్టిఫికేషన్ అండ్ హోమోలోగేషన్ ప్రక్రియ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఆ వాహనం రహదారికి యోగ్యమైందని.. భారత్‌లో తయారు చేసినా లేదా దేశంలోకి దిగుమతి చేసుకున్న అన్ని వాహనాలకు ఉండే రూల్స్‌కు అనుగుణంగా ఉందని వెరిఫై చేసే ప్రక్రియ. అందుకే టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారత్‌లో మోడల్ వై, మోడల్ 3 కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులు చేసింది.
Also Read: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ.. చివరికి!
ప్రస్తుతం టెస్లా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల విక్రయాల సంస్థగా కొనసాగుతోంది. భారత్‌లో అడుగుపెట్టేందుకు గత కొంతకాలంగా ఈ కంపెనీ యత్నిస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా జరిగాయి. అయితే త్వరలోనే టెస్లా కార్లు ఇండియన్ మార్కెట్‌లోకి అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది. కానీ టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ను ఇండియాలో ప్రారంభిస్తారా ? లేదా ? అనేదానిపై క్లారిటీ లేదు.
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
అమెరికాలో టెస్లా కారు చవకగా ఉంది. మోడల్ 3 ధర ఫ్యాక్టరీ స్థాయిలో 35 వేల డాలర్లు (రూ.30.4 లక్షలు) గా ఉంది. ఇక భారత్‌లో దిగుమతి సుంకాలు 15 నుంచి 20 శాతం తగ్గించడం, రోడ్ ట్యాక్స్ అలాగే ఇన్సూరెన్స్ వంటి ఖర్చులతో కలిపి ఆన్‌రోడ్ ధర 40 వేల డాలర్లు(దాదాపు రూ.35-40 లక్షలు)గా ఉంటుంది. ఇక టెస్లా మోడల్ వై ధరలు చూసుకుంటే రూ.70 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.
Also Read: పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టని ప్రకాశ్‌రాజ్.. Xలో సెటైర్ల వర్షం