BREAKING: అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం..

అమెరికాలో మరో ప్రవాస తెలుగు వ్యక్తి అకాల మరణం చెందారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన జి. సునీల్ కుమార్ గుండ్రాయ్ (51) ఫ్లోరిడాలోని టాంపా నగరంలో గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.

New Update
Death

Death

అమెరికాలో మరో ప్రవాస తెలుగు వ్యక్తి అకాల మరణం చెందారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన జి. సునీల్ కుమార్ గుండ్రాయ్ (51) ఫ్లోరిడాలోని టాంపా నగరంలో గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. తన నివాస ప్రాంగణంలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీల్ కుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Also Read: పెట్రోల్, డీజిల్ పరిమితంగా వాడండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

 సునీల్ కుమార్ మూడేళ్ల క్రితమే అమెరికాకు వెళ్లారు. అక్కడ పనిచేస్తూ ఇటీవలే మరో కంపెనీకి మారినట్లు సునీల్‌ చిన్ననాటి స్నేహితులు చెప్పారు. కుటుంబానికి ఏకైక ఆధారమైన సునీల్ అకాల మరణంతో భార్యాపిల్లలు విషాదంలో మునిగిపోయారు. అయితే బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) సహా పలువురు ప్రవాస మిత్రులు ముందుకొచ్చారు. వారికి తక్షణ ఆర్థిక అవసరాలు, అంత్యక్రియల ఖర్చులు, పిల్లల చదువుల నిమిత్తం విరాళాలు సేకరించేందుకు ‘గోఫండ్‌మీ’ (GoFundMe) ద్వారా ప్రత్యేక నిధి సహాయక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

ఇదిలాఉండగా అమెరికాలో మరో తెలుగు యువతి కూడా స్విమ్మింగ్‌ఫుల్‌లో ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. హెదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కూతురు శ్రీవీణ అమెరికాలోని వర్జీనియా లో తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఇటీవల బంధువులతో కలిసి శ్రీవీణ వెకేషన్ కోసం ఫ్లోరిడా వెళ్లింది. అక్కడ రిసార్ట్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు దిగి నీటిలో మునిగిపోయింది. ఆమెను గమనించిన సన్నిహితులు వెంటనే  బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు