/rtv/media/media_files/2025/02/13/dtxPYzh5phqibsjjOWNl.jpg)
Teen Students In Surat Perform Stunts In Luxury Cars To Celebrate Farewell
గుజరాత్‌లోని ఓ స్కూల్‌లో నిర్వహించిన పార్టీకి 35 లగ్జీరీ కార్లతో కాన్వాయ్‌గా వెళ్లి హంగామా చేసిన దృశ్యాలు వైరలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. అలాగే 22 కార్లను సీజ్ చేశారు. మిగతా కార్ల కోసం గాలిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని ఓల్పాడ్ ప్రాంతంలో ఓ పాఠశాలలో ఇటవలే ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించారు.
Also Read: ఢిల్లీ సీఎం ఎంపిక అప్పుడే.. ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్..!
ఈ క్రమంలోనే ఈ పార్టీలో పాల్గొనేందుకు పలువురు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 35 లగ్జరీ కార్లను రెడీ చేసుకున్నారు. BMW, బెంజ్, ఆడీ, మసెరాటి, పోర్షే వంటి లగ్జరీ కార్లు ఇందులో ఉన్నాయి. ఇందులో కొందరు విద్యార్థులు కార్లు నడుపుతుండగా.. మరికొందరు డోర్లపై ప్రమాదకరంగా కూర్చుకున్నారు. మరికొందర్ సన్‌రూఫ్‌పై స్మో్క్‌గన్‌లతో స్టంట్లు చేస్తూ వెళ్లారు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
સુરતમાં આ તે કેવું ફેરવેલ…?, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નીકળ્યા લગઝરી કારના કાફલા સાથે…..#surat #suratcity #suratcitypolice #suratpolice #student #students #car #cars #trending #tranding #breakingnews #viralnews #newsupdate #viral #tras #vehicle #shandarrajkot pic.twitter.com/4alFHamuj1
— Shandar Rajkot (@ShandaRajkot) February 10, 2025
Also Read: ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్!
దీనిపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. చివరికి ఈ విషయం పోలీసులు దృష్టికి వెళ్లింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటిదాకా ఆరు కేసులు నమోదు చేశారు. 35 కార్లలో 26 గుర్తించారు. అందులో 22 వెహికిల్స్‌ను సీజ్ చేశారు. వాటి యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. పలువురు స్టూడెంట్స్ తల్లిదండ్రులతో పాటు సంట్లు చేసి నడిపిన డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.