Techie: రూ.8 కోట్లతో ప్రమోషన్ ఓ చేతిలో...భార్య నుంచి విడాకులు మరో చేతిలో...జీవితంలో ఓడిపోయనంటూ ఓ టెకీ ఆవేదన!

రోజుకు 14 గంటల పాటు మూడేళ్లు కష్టపడ్డాడు.అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. కోట్ల ప్యాకేజీ అందుకున్న తర్వాత భార్య విడాకుల నోటీసులు పంపి షాకిచ్చింది.వృత్తి పరంగా గెలిచా కానీ..జీవితంలో ఓడిపోయా అంటూ ఓ టెకీ సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అవుతుంది.

New Update
divorce

divorce

Techie: వృత్తి జీవితంలో  ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే తపనతో  మూడేళ్ల పాటు రాత్రనక పగలనక కష్టపడిన ఓ యువకుడు.. తాను అనుకున్నది సాధించాడు. దాదాపు రూ. 8 కోట్లు ప్యాకేజీతో ఉద్యోగంలో పదోన్నత అందుకున్నాడు. కానీ, ఈ క్రమంలో తాను జీవితాన్ని కోల్పోయానని, సంతోషమే లేకుండా పోయిందని వాపోతున్నాడు. సోషల్‌ మీడియాలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read: Hyderabad: హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్‌...ఆ ఏరియాల్లో తాగునీరు బంద్‌..ఎన్ని రోజుల పాటు అంటే!

 ‘కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోడానికి నిరంతరం శ్రమించా.. ఎట్టకేలకు నా లక్ష్యం అందుకున్నా. రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్ దక్కింది.. కానీ నాకు సంతోషంగా లేదు’ అని టెకీ పోస్టు పెట్టాడు. ఓ చేతితో ప్రమోషన్ లెటర్, మరో చేతితో విడాకుల నోటీసు అందుకున్నానంటూ తన బాధను వ్యక్తం చేశాడు.

Also Read: Madhavi Latha Vs JC Prabhakar Reddy: మాధవీలత బిగ్ ట్విస్ట్.. జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్

అయితే, తన పేరు, ఇతర వ్యక్తిగత వివరాలను అతడు చెప్పలేదు. మూడేళ్ల కిందట ఓ సంస్థలో తాను సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌గా చేరినట్టు మాత్రం చెప్పుకొచ్చాడు.  ప్రమోషన్ కోసం రోజుకు 14 గంటలు పనిచేశానని, ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీసు, మీటింగ్‌లతో బిజీబిజీగా ఉండే వాడినని తెలిపాడు. ఈ క్రమంలో తన భార్య ప్రసవ సమయంలో పక్కనే ఉండాల్సింది పోయి.. కనీసం పట్టించుకోలేదని అన్నాడు. 

తన కూతురు పుట్టిన సమయంలో పనిలో తలమునకలైపోయానని, ప్రసవం తర్వాత తన భార్య మానసికంగా ఒడిదొడకులను ఎదుర్కొందని వివరించాడు. అప్పుడు కూడా ఆమెకు అండగా నిలవలేకపోయానని చెప్పారు. భరోసా ఇవ్వాల్సిన తాను పనిలోనే మునిగిపోయానని, కౌన్సిలింగ్ కోసం వైద్యుడ్ని కలిసేందుకు ఆమె వెళితే తోడుగా వెళ్లలేకపోయానని వివరించాడు. బంధువులు, స్నేహితులను కలవడం మానేసి, కుటుంబంలో జరిగే శుభకార్యాలు, వేడుకలను త్యాగం చేసి ఉద్యోగానికే అంకితమయ్యానని తెలిపాడు. 

దీంతో తనకు ప్రమోషన్ వచ్చిందని, రూ.7.8 కోట్ల వార్షిక వేతనం అందుకోబోతున్నాను. మూడేళ్ల పాటు పడి కష్టానికి ఫలితం వచ్చిందని సంతోషంలో ఉన్న తనకు భార్య ఊహించని విధంగా విడాకులు నోటీసు పంపించి పెద్ద షాకిచ్చిందని తెలిపాడు. తనతో కలిసి ఉండేందుకు ఆమె ఇష్టపడటం లేదని, విడాకులు కావాలని కోరిందని అన్నాడు. దేని కోసమైతే మూడేళ్లు తాను కష్టపడ్డానో అదే తన వ్యక్తిగత జీవితంలో అలజడి రేపిందని అతడు వాపోతున్నాడు.

 ‘‘నా జీవితంలో నేను ఏమి చేస్తున్నానో అని నన్ను నేను ప్రశ్నించుకోకుండా ఉండలేకపోతున్నాను... కానీ ఈ లేఆఫ్‌ల తుఫాన్ల సమయంలో నా దగ్గర ఉన్నదానితో నేను సంతోషంగా ఉండాలి కదా? కానీ అలా ఎలా ఉండగలను?’ అని ఆవేదన చెందాడు. అయితే, ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బిడ్డ పుట్టబోతుందని తెలిసీ ఆ క్షణాన్ని ఆస్వాదించకుండా విధులను పట్టుకుని వేలాడటం ఏంటి? అని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..

‘గతంలో నేను ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాను.. తన చుట్టూ ఉన్న విజేతలను చూస్తే అంతా శూన్యమని గ్రహించి దానిని నుంచి బయటపడ్డాను’’ అని అన్నాడు. కుటుంబానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచనలు చేస్తున్నారు.

Also Read: Indian illegal immigrants: మరో 119 మందితో అమెరికా నుంచి బయల్దేరిన విమానం..ఈ సారి ల్యాండింగ్‌ ఎక్కడంటే!

Also Read: Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్‌ ఉందబ్బా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment