Tamilnadu Politics: అన్నాడీఎంకేలో తిరుగుబాటు సెగ.. పాండిచ్చేరి రిసార్ట్‌కు షణ్ముగం టీం

విజయ్ రాజ్‌భవన్‌లో ఉండగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కూడా అత్యవసరంగా గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
palaniswami

palaniswami

తమిళనాడు రాజకీయాల్లో(tamilnadu politics) ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో విజయ్ రాజ్‌భవన్‌లో ఉండగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Palaniswami) కూడా అత్యవసరంగా గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ తర్వాత పళనిస్వామి గవర్నర్‌తో భేటీ కానుండటంతో..ఈయన టీవీకేకు మద్దతు ఇస్తారా లేక కొత్త రాజకీయం మొదలుపెడతారా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

Also Read: బెంగాల్ లో హైటెన్షన్.. అర్థరాత్రి వరకే ఛాన్స్.. మమత రాజీనామా చేయపోతే ఏం జరుగుతుంది?

Palaniswami Seeks Appointment Governor

విజయ్‌కు మద్దతిచ్చే విషయంలో AIADMKలో చీలిక కనిపిస్తోంది. టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ అయోమయ పరిస్థితుల మధ్య పళనిస్వామి తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే చెన్నైకి పిలిపించారు. బీజేపీతో సంబంధాలు తెంచుకుని విజయ్‌తో కలవాలని పార్టీలోని ఓ వర్గం పళనిస్వామిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: షాకింగ్ ఘటన.. ఈడీ సోదాల భయంతో రోడ్డుపై విసిరేసిన రూ.500 నోట్ల కట్టలు

అయితే ఈ రాజకీయ సంక్షోభం అన్నాడీఎంకేలో తిరుగుబాటుకు దారితీసేలా కనిపిస్తోంది. సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఓ వర్గంలో15 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు TVKకు సపోర్ట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పళనిస్వామి వీళ్లను మందలించినప్పటికీ కూడా షణ్ముగం వర్గం పాండిచ్చేరిలోని ఓ రిసార్ట్‌కు వెళ్లిపోవడం సంచలనం రేపుతోంది. దీంతో అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పళనిస్వామి గవర్నర్‌ను కలవడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉండొచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఆయన విజయ్‌కు సపోర్ట్ ఇస్తారా ? లేదా ? అనేది సస్పెన్స్‌గా మారింది. 

Advertisment
తాజా కథనాలు