/rtv/media/media_files/2026/05/07/govrnor-2026-05-07-12-21-28.jpg)
BIG BREAKING: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు విజయ్ (TVK) చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్(tamilnadu governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మరోసారి బ్రేక్ వేశారు. గురువారం ఉదయం గవర్నర్‌తో జరిగిన 40 నిమిషాల భేటీ విజయ్‌కు నిరాశనే మిగిల్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని విజయ్ చేసిన అభ్యర్థనపై గవర్నర్ సంతృప్తి చెందలేదు. కేవలం 113 మంది మద్దతుతో ప్రభుత్వం ఎలా స్థిరంగా ఉంటుందని గవర్నర్ ప్రశ్నించారు.
Also Read: అదిరిపోయే అప్‌డేట్.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్!
118 మంది ఎమ్మెల్యేల స్పష్టమైన మద్దతు
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందే 118 మంది ఎమ్మెల్యేల స్పష్టమైన మద్దతు పత్రాన్ని సమర్పించాలని గవర్నర్ విజయ్‌కు సూచించారు. ఆ సంఖ్య ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలా లేక మెజార్టీ కోసం వేచి చూడాలా అనే అంశంపై న్యాయవాదుల సలహా తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు విజయ్ తన వాదనను వినిపించినప్పటికీ, గవర్నర్ మాత్రం రాజ్యాంగ పరమైన చిక్కులను సాకుగా చూపిస్తూ అనుమతి నిరాకరించారు.
Also Read: TMC రెండు ముక్కలు...మమత మీటింగ్‌కు 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా!
గవర్నర్ నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో టీవీకే శిబిరంలో టెన్షన్ నెలకొంది. మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతును ఎలా కూడగట్టాలనే దానిపై విజయ్ తన కోర్ కమిటీతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఒకవేళ గవర్నర్ పంతం వీడకపోతే, సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేక ఇతర పార్టీలతో అధికారికంగా పొత్తులు ప్రకటించాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరించారన్న వార్తతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాజ్‌భవన్ చుట్టూ భారీగా భద్రతను పెంచారు.
Also Read: విజయ్ నీకు ఆరు నెలలు టైమ్ ఇస్తాం.. స్టాలిన్ సంచలన కామెంట్స్!
Follow Us