NEP విద్యా విధానం కాదు.. బీజేపీ విధానం: సీఎం స్టాలిన్

సీఎం స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) అనేది విద్యా విధానం కాదని.. బీజేపీ విధానమని అన్నారు. భారత్‌ను అభివృద్ధి పథంలోకి నడిపించాలనే ఉద్దేశం వాళ్లకి లేదని విమర్శించారు.

New Update
CM Stalin

CM Stalin

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)లో భాగమైన త్రిభాషా విధానంపై కేంద్ర, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం స్టాలిన్ మరోసారి స్పందించారు. కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) విద్యా విధానం కాదని.. బీజేపీ విధానమని అన్నారు. భారత్‌ను అభివృద్ధి పథంలోకి నడిపించాలనే ఉద్దేశం వాళ్లకి లేదని.. దేశవ్యాప్తంగా హిందీని వ్యాప్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. తమిళనాడులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

Also Read: 350 ఏళ్ల పోరాటం.. దళితులకు ఆ గుడిలో పూజలు చేసుకునేందుకు అనుమతి!

NEP.. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన తరగతుల అభివృద్ధిని వ్యతిరేకిస్తుంది. 3,5 తరగతులకు పబ్లిక్‌ బోర్డు పరీక్షలు నిర్వహించి అందులోనే విద్యార్థులను ఫిల్టర్ చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. వృత్తి విద్యా పేరుతో కుల విద్యను ప్రవేశపెడుతోందని'' స్టాలిన్ అన్నారు. మరోవైపు ఈ త్రిభాషా విధానాన్ని విపక్ష పార్టీలు, ముఖ్యంగా తమిళనాడులో డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని, ఈ భాష వల్ల 25 స్థానిక భాషలు కనుమరుగయ్యాయని ఇప్పటికే సీఎం స్టాలిన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. 

Also Read: ఢిల్లీలో కారు యాక్సిడెంట్.. కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం!

మరోవైపు డీఎంకే పార్టీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందని ఆరోపించింది. భాషాపరంగా వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. అలాగే డీలిమిటేషన్‌పై కూడా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల సౌత్ రాష్ట్రాలకు తక్కువ ఎంపీ సీట్లు వస్తాయని.. నార్త్ రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BREAKING : సుప్రీం కోర్టు నూతన CJIగా BR గవాయ్ పేరు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.

New Update
new CJI

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు. మే 14న తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. సుప్రీంకోర్టకు రాకముందు ముంబై హైకోర్టు జడ్జిగా చాలాకాలం పని చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో గవాయ్ జన్మించారు. 64 ఏళ్ల జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 2025 లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సిజెఐ పదవీకాలం 2025 మే 14 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది.

ఈయన తండ్రి ఏఆర్ గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. లోక్ సభ, రాజ్యసభలో ఎంపీగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే, బీహార్, కేరళా,సిక్కిం రాష్ట్రాల గవర్నర్ గా కూడా పని చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment