West Bengal: కాంగ్రెస్, స్టాలిన్‌తో బీజేపీ ఒప్పందం.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్‌, అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు ఆరోపించారు.

New Update
Tamil Nadu CM Stail and Cong in tacit understanding with BJP, Says Mamata benarjee

Tamil Nadu CM Stail and Cong in tacit understanding with BJP, Says Mamata benarjee

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్‌, అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు ఆరోపించారు. అందుకే పశ్చిమ బెంగాల్‌ నుంచి ఎక్కువగా IAS, IPS అధికారులను తమిళనాడు పోలింగ్‌కు అబ్జర్వర్లుగా పంపించినట్లు తెలిపారు. దీనివల్ల బెంగాల్‌లో జరగాల్సిన అభివృద్ధి పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. 

Also Read: లాక్‌డౌన్ టైంలో లాక్‌అప్ డెత్.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన కోర్టు

నడియా జిల్లాలోని ఎన్నికల ప్రచార సభలో దీదీ మాట్లాడారు. త్వరలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ జరగనుండగా.. కేవలం పశ్చిమ బెంగాల్ నుంచే ఏకంగా 500 మంది అధికారులను బదిలీ చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తమ సొంత అధికారులను బెంగాల్‌లో కీలక పదువుల్లో పెట్టిందని.. వాళ్లకు అనుకూలంగా పనులు చేయించుకుంటోందని విమర్శించారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేపలు, మాంసం, గుడ్లు తినడాన్ని నిషేధిస్తారని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన సమగ్ర ఓటర్ల సవరణల వల్ల పశ్చిమ బెంగాల్‌లో 250 మంది చనిపోయినట్లు గుర్తుచేశారు. దీనికి బీజేపీ బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు. 

Also Read: ఆ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే.. ఎక్కడో తెలుసా ?

ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో విపక్షాల ఐక్యతకు కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. అంతేకాదు కోల్‌కతాను టార్గెట్ చేసుకుంటామని పాక్ రక్షణ శాఖ మంత్రి పిచ్చికూతలు కూస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మమతా నిలదీశారు. ఇటీవల ఇక్కడ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. అందుకే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు