/rtv/media/media_files/2025/03/17/SQvxuftq5l31aNRoBZ4m.jpg)
Swathi Love Jihad Case
కర్ణాటకలోని హవేరి జిల్లాలో సంచలనం రేపిన స్వాతి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇది లవ్ జిహాద్ అని పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ హత్యను ఖండిస్తూ రేపు మసూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. స్వాతిని లవ్ జిహాద్ పేరుతో హత్య చేశాని ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్‌తో పాటు మరికొన్ని హిందూ సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనపై సరైన దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే మంగళవారం పోస్టర్లు అతికిస్తూ మసూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
Also Read: వృద్ధ దంపతులకు బ్యాంకు మేనేజర్ టోకరా.. రూ.50 లక్షలు మోసం
అలాగే స్వాతి హిందూ అనుకూల సంస్థల్లో కూడా చురుకుగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆమె కాషాయ తలపాగ ధరించి, చేతిలో కత్తి పట్టుకుని ఉన్న పలు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీరామ సేన వ్యవస్థపాకుడు ప్రమోద్ ముతాలిక్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు అన్షి కుమార్‌కు స్వాతి హత్య కేసుకు సంబంధించి వివరాలు అందించారు. ఈ కేసులో ఆమెకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రమోద్.. స్వాతి హత్యను లవ్ జిహాద్‌కు అభివర్ణించారు. ఆమెను ప్రేమించిన నయాజ్ అనే వ్యక్తి మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని.. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు ఆరోపించారు.
Also Read: పాకిస్థాన్‌లో ఎయిర్‌పోర్టులో దాడులు.. మరో ఉగ్రవాది హతం !
ఈ హత్యకు పలువురు హిందూ యువకులు కూడా సహకరించారని.. హవేరి జిల్లాలో ప్రస్తుతం లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. మరోవైపు హంపిలో విదేశీ మహిళపై జరిగిన అత్యాచారం గురించి కూడా మాట్లాడారు. ఈ కేసులో బాధితురాలికి ఇంకా న్యాయం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే స్వాతి కుటుంబానికి ముస్లిం సమాజం.. రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం నుంచి కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు నయాజ్ తరఫున కోర్టులో ఎవరూ వాదించకూడదని, బెయిల్ మంజూరు చేయకూడదని కోరారు. పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ లాంటి సంస్థలపై నిషేధం ఉన్నప్పటికీ అవి రహస్యంగా శిక్షణ అందిస్తున్నాయని ప్రమోద్ ఆరోపించారు. ముస్లిం యువకులకు హిందూ అమ్మాయిలను ప్రేరేపించేలా శిక్షణ ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.