సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్‌ !

మహారాష్ట్రలో సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక ఏక్‌నాథ్‌ షిండేకు, అలాగే అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

New Update
CM FADNAVIS

మహారాష్ట్రలో సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక ఏక్‌నాథ్‌ షిండేకు, అలాగే అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. డిసెంబర్‌ 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే రోజున ఫడ్నవీస్‌తో పాటు షిండే, అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నాయి. 

Also Read: తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు?

రేపే సీఎం ఎన్నిక

బుధవారం బీజేపీ నేతల శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎమ్మెల్యేలు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. సీఎం పదవి, మంత్రిత్వ శాఖల కేటాయింపులపై మహాయుతి కూటమిలో గత కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎం పదవి తనకొద్దని హోంశాఖను ఇవ్వాలని షిండే అడిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో ఉన్న పరిస్థితులు పర్యవేక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీలను పరిశీలకులుగా బీజేపీ అధిష్ఠానం నియమించింది.    

Also Read: కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

అలాగే ఎన్డీయే నేత రామ్‌దాస్‌ అథవాలే తాజాగా ఏక్‌నాథ్ షిండేతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించాలని ఆయన షిండేను నచ్చజెప్పినట్లు పలు కథనాలు వెల్లడించాయి. ఈ పదవి తీసుకునేందుకు షిండే కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా.. ఇటీవల అనారోగ్యం కారణంగా షిండే తన సొంతూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన మళ్లీ ముంబయికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం ఇంకా మెరుగుపడకపోవడంతో మంగళవారం షిండేను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఠాణెలోని ఓ ఆసుపత్రిలో ఆయన చెకప్ చేయించుకున్నారు. షిండేకు కొన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. 

Also Read: భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్

Also Read: ఆస్ట్రేలియా మీడియాలో బుమ్రా నామస్మరణ.. ఆటగాళ్లు సైతం ఫిదా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు