/rtv/media/media_files/2025/03/23/fdr3B5KS4S0f9Dsu3c2Z.jpg)
Supreme Court makes report on Justice Varma cash row public, videos show burnt currency
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ 25 పేజీల రిపోర్టును శనివారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. ఇందులో జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన వివరాలతో పాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. అంతేకాదు ఈ రిపోర్టును సుప్రీంకోర్టు శనివార రాత్రి తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.
दिल्ली हाई कोर्ट के जज जस्टिस वर्मा के घर पर जले हुए इंसाफ के बंडल सबूत बनकर सामने आए!! pic.twitter.com/qKYXIAUsuM
— ASHUTOSH MISHRA (@JournoAshutosh) March 22, 2025
Also Read: రాజీవ్ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీపే ఉపాధ్యాయ రిపోర్టును పరిశీలిస్తే.. సగం కాలిన నోట్ల కట్ట గురించి ఉంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఉందనే విషయం అందులో కనిపించింది. అయితే స్టోర్‌రూమ్‌లో తాను గానీ, తన కుటంబ సభ్యులు గానీ ఎలాంటి నగదు ఉంచలేదని జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ తెలిపారు. తమకు చెందిన నగదు దొరికినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.
Also Read: కిచెన్ లో ఖాళీ బుల్లెట్లతో పోలీస్ ఆఫీసర్ ప్రయోగం.. చివరికి ఏమైందంటే..?
మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మూడు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్, పంజాబ్-హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ శీల్ నాగు ఉంటారు. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతం కేసుల విచారణపై ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ డీకే ఉపాధ్యాయను ఆదేశించారు.
Also Read: బెల్జియంలో ఛోక్సీ..రప్పించేందుకు భారత్ విశ్వ ప్రయత్నాలు!
delhi | delhi-high-court | telugu-news | rtv-news