/rtv/media/media_files/2025/02/04/WmKQwFivfqzqvyb1wNZ0.jpg)
Supreme Court
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియ ఇండియాస్ గాట్ టాలెంట్(India’s Got Latent) కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా మాట్లాడే భాషను ఎవరైనా ఇష్టపడుతారా అంటూ మండిపడింది. '' మీ మెదడులో ఉన్న చెత్తనంతా ఈ ప్రొగ్రామ్ ద్వారా బయటపెట్టారు. మీరు పాపులర్ అయినంత మాత్రనా ఏదైనా మాట్లాతాను అంటూ సమాజం దీనికి ఆమోదించదు.
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా ? ఇలాంటి వారికి న్యాయస్థానం ఎందుకు రక్షణ కల్పించాలి అని సుప్రీంకోర్టు నిలదీసింది. రణ్‌వీర్‌కు ఇలా చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు చివరికీ ఊరట కల్పించింది. ఈ వ్యవహారంలో పోలీసులు మరో కేసు నమోదు చేయకూడదంటూ ఆదేశించింది. కోర్టు పర్మిషన్ లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని రణ్‌వీర్‌కు హెచ్చరించింది. అంతేకాదు రణ్‌వీర్ తన పాస్‌పోర్టును మహారాష్ట్రలో ఠాణె పోలీసులకు ఇవ్వాలని ఆదేశించిది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఎలాంటి షోలు చేయకూడదని స్పష్టం చేసింది.
Also Read: దక్షిణ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 31 మంది మృతి
ఇదిలాఉండగా ఇండియా గాట్ టాలెంట్ షోలో తల్లిదండ్రుల శృంగారంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రణ్‌వీర్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రణ్‌వీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి తరఫున రిటైర్డ్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కొడుకు జస్టీస్ అభినవ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు. రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు తాను కూడా సమర్థించనని.. కానీ అతడిని హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని కోర్టుకు తెలిపారు. దీనిపై మహారాష్ట్ర, అస్సాం పోలీసులకు ఆశ్రయించవచ్చని న్యాయస్థానం సూచించింది. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా అని కేంద్రాన్ని కూడా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాంటూ నోటీసులు పంపింది.