/rtv/media/media_files/2026/04/30/sunil-maurya-analysis-on-west-bengal-assembly-elections-2026-2026-04-30-15-18-59.jpg)
Sunil Maurya Analysis on West Bengal Assembly Elections 2026
పశ్చిమ బెంగాల్‌లో బుధవారం రెండోదశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రానుందని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. కానీ ప్రముఖ సర్వే సంస్థ అయిన పీపుల్స్ పల్స్ మాత్రం ఈసారి కూడా టీఎంసీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని చెప్పింది. టీఎంసీకి 117-187, బీజేపీకి 95-100 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తాజాగా సునిల్ మౌర్య అనే ఓ జర్నలిస్టు కూడా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రానుందని గట్టిగా చెబుతున్నారు.
Also Read: పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ TMC, తమిళనాడులో DMK, .. పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
టీఎంసీ 160 నుంచి 190 స్థానాల్లో గెలుస్తుందని సునిల్ మౌర్య తెలిపారు. ఇక బీజేపీ 90 నుంచి 110 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నారు. అయితే ఈసారి కూడా పశ్చిమబెంగాల్‌లో దీదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గల మూడు ప్రధాన కారణాలు కూడా ఆయన వివరించారు.
1. పౌరసత్వాన్ని కోల్పోతామనే భయం
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నుంచి పేర్లు తొలగించడం వల్ల తమ పౌరసత్వం ఎక్కడ పోతుందో అన్న భయం ప్రజల్లో ఉందని తెలిపారు.
2.చొరబాటుదారులుగా ముద్ర వేస్తారనే భయం
టీఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే తమను చొరబాటుదారులుగా గుర్తించి.. బంగ్లాదేశ్‌కు పంపిస్తారనే భయం, ఆందోళన ప్రజల్లో బలంగా ఉందని పేర్కొన్నారు.
3.ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోతామనే భయం
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి అందుతున్న రూ. 1500 ఆర్థిక ప్రయోజనాలు ఎక్కడ ఆగిపోతాయోనన్న భయం ఉందని వెల్లడించారు.
बंगाल विधानसभा चुनाव 2026 पर अपना निजी विश्लेषण:
— Sunil Maurya (@smaurya_journo) April 30, 2026
BJP और TMC को कितनी सीटें मिलेंगी। और क्यों मिलेंगी। समझ लीजिए। BJP 90-110
TMC 160-190+
3 बड़ी वजह - डर, डर, डर।
1-SIR में नाम कटने से लोगों के मन में नागरिकता खत्म होने का डर।
2-घुसपैठिया बता बांग्लादेश भेज दिए जाने का डर।… pic.twitter.com/ADI2903i0S
Also Read: తమిళనాడులో త్రిముఖ పోరు.. విజయ్ రాకతో మారిన లెక్కలు..
పశ్చిమ బెంగాల్ ప్రజల్లో ప్రధానంగా ఈ మూడు భయాలు ఉన్నాయని.. అందుకే ఈసారి కూడా టీఎంసీ ప్రభుత్వం కచ్చితంగా అధికారంలోకి వస్తుందని సునిల్ మౌర్య నొక్కి చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన ఎక్స్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ మాత్రమే వీటికి భిన్నంగా టీఎంసీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. ప్రముఖ జర్నలిస్టు సునిల్ మౌర్య సైతం ఈసారి టీఎంసీ అధికారంలోకి వస్తుందని కచ్చితంగా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us