/rtv/media/media_files/2026/05/02/students-admitted-to-hospital-due-to-rashes-after-drinking-contaminated-water-in-rajasthan-2026-05-02-20-11-06.jpg)
Students Admitted To Hospital Due To Rashes After Drinking Contaminated Water In Rajasthan
రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సనావాడ పరిధిలోని ఓ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో కలుషిత నీరు తాగి 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. శనివారం ఉదయం స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం కోసం హాజరైన విద్యార్థులు.. అక్కడున్న వాటర్ ట్యాంక్ నీటిని తాగారు. ఆ తర్వాత కాసేపటికే అనారోగ్యం బారిన పడ్డారు. నీళ్లు తాగిన విద్యార్థులకు ఒక్కసారిగా శరీరంపై దురద, దద్దుర్లు వచ్చాయి.
Also Read: స్ట్రాంగ్ రూముల్లో లీడర్ల భవిష్యత్తు...ఇంతకీ ఈ స్ట్రాంగ్‌రూమ్ అంటే ఏంటంటే?
దీంతో పాఠశాల సిబ్బంది అలెర్ట్ అయ్యారు. విద్యార్థులను వెంటనే స్థానిక సనావాడ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స అందించినప్పటికీ విద్యార్థుల పరిస్థితిలో మార్పు కనిపించలేదు. దీంతో మెరుగైన వైద్య చికిత్స కోసం బర్మార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థకు గురైన విద్యార్థులందరూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.
Also Read: విజయ్ పార్టీకి 121 సీట్లు.. 41% ఓట్లు.. మరో సంచలన సర్వే
మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేంద్ర సింగ్ ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అలర్జీ లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణహాని లేదన్నారు. మరోవైపు నీటి ట్యాంక్ కలుషితం కావడానికి గల కారణాలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కలుషితమైన తాగునీటి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపినట్లు సమాచారం.
Follow Us