Kolkata: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య

కోలకత్తా ఆర్జీకర్ కాలే్ అండ్ హాస్పటల్. దేశంలో దీని పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. జూనియర్ డాక్టర్ రేప్, హత్య తరువాత ఈ ఆసుపత్రి పేరు మారు మోగిపోయింది. ఇప్పుడు ఇదే మెడికల్ కాలేజ్ కు చెందిన ఓ యువతి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.

author-image
By Manogna alamuru
New Update
kolkata

R.G.kar Hospital

కోలకతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అక్కడి కమర్ హతి ఈఎస్ఐ క్వార్టర్స్ లో తన గదిలో ఉరి వేసుకుని చనిపోయింది. విద్యార్థిని తల్లి ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె శవమై కనిపించింది. ఎంత తుపుకొట్టినా తీయకపోయేసరికి అనుమానం వచ్చి బద్దలు కొట్టి చూడగా...విద్యార్థిని ఉరివేసుకుని కనిపించిందని తల్లి చెప్పారు. వెంటనే దగ్గరలో ఉన్న వారి సహాయంతో ఆమె ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమ చనిపోయి చాలా సేపు అయిందని డాక్టర్లు చెప్పారు. తరువాత మృతదేహానని పోస్ట్ మార్టం కు పంపించారు. 

Also Read: మరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. పొంగులేటీ సంచలన ప్రకటన

డిప్రెషన్ తోనే అని అనుమానం..

ఈ ఘటనపై కమర్ హతి పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అని పోలీసులు తెలిపారు. అయితే ఆమె చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని...అది భరించలేకే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. డిప్రెషన్‌తో బాధపడి సూసైడ్ చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు.

Also Read: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CRIME NEWS: అయ్యో పాపం.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం- రోలర్‌ కోస్టర్‌ నుంచి కిందపడి యువతి స్పాట్‌డెడ్!

ఢిల్లీలో 24 ఏళ్ల యువతి రోలర్‌ కోస్టర్ నుంచి కింద పడి మృతి చెందింది. ప్రియాంకకు నిఖిల్‌తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. సరదాగా తిరిగొద్దామని కాప్‌సహేడా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ ఎక్కారు. దాని స్టాండ్ విరగడంతో ఆమె కిందపడి మరణించింది.

New Update
Delhi woman dies after falling from Roller Coaster

Delhi woman dies after falling from Roller Coaster

నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ నుండి కింద పడి 24 ఏళ్ల ప్రియాంక మృతి చెందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

ఏం జరిగిందంటే?

నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంకతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. అక్కడ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో గురువారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. అదే సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగి ఆమె కింద పడిపోయింది. దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం

పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో మృతిచెందిన మృతురాలు ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ENT రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద పంక్చర్ గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు ఉన్నాయని తెలిపారు. 

ఇది కూడా చదవండి: డేంజర్.. ఇలాంటి సన్‌స్క్రీన్ లు వాడితే ముఖంపై తెల్లటి మచ్చలు!

కాగా చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రియాంకకు ఫిబ్రవరి 2026లో వివాహం జరగాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: కూల్‌ డ్రింక్స్‌ కాదు రాగి అంబలి తాగండి.. సింపుల్‌గా ఇలా చేసుకోండి!

(crime news | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment