పదవ తరగతి పరీక్షల్లో చీటింగ్‌ జరిగిందని తుపాకులతో కాల్పులు.. ఒకరు మృతి

బీహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో చీటింగ్‌ జరిగిందని విద్యార్థులు మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలువురు విద్యార్థులు ఏకంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరు మృతి చెందారు.

New Update
Students Clash in Bihar

Students Clash in Bihar

బీహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లాలో దారుణం జరిగింది. పదో తరగతి పరీక్షల్లో చీటింగ్‌ జరిగిందని వచ్చిన ఆరోపణలు తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. పలువురు విద్యార్థులు ఏకంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. మరోకరు చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే  ఈ స్టోరీ చదవాల్సిందే.  

Also Read: హత్య బెదిరింపులపై స్పందించిన ఏక్‌నాథ్‌ షిండే.. ఏమన్నారంటే ?

ఇక వివరాల్లోకి వెళ్తే బీహార్‌లో ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే రోహ్‌తాస్‌లోని సాసారామ్‌ పట్టణంలో ఫిబ్రవరి 19న జరిగిన పరీక్షల్లో చీటింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థుల మధ్య వివాదం చెలరేగింది. మరుసటి రోజు విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు పాల్పడ్డారు. మరికొందరు తుపాకులతో కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనే ఇద్దరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఒకరు మృతి చెందారు.     

Also Read: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది?

దీంతో బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహంతో జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సాసారామ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. విద్యార్థులు చికిత్స తీసుకుంటున్న స్థానిక ఆస్పత్రి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఘటనపై విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. స్పాట్‌లోనే 9మంది మృతి!

Also Read: ట్రంప్‌ ఎఫెక్ట్‌ ...నిర్బంధించి పంపేస్తారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధునిక జిన్నా: తరుణ్ చుగ్

పశ్చిమ బెంగాల్‌లో హింసకు మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అల్లర్లు చెలరేగుతుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉండటాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఖండించారు. తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆదునిక జిన్నాతో పోల్చారు.

author-image
By K Mohan
New Update
CM Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్‌

వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వక్ఫ్ సవరణ చట్టం 2025 పై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లో తీవ్ర అసంతృ‌ప్తి జ్వాలలు ఎగిపిపడుతున్నాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 బిజెపిని ప్రశంసించి తగిన ఒక సాహసోపేతమైన చర్య.

ఈ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలోని అనేక నగరాల్లో నిరసనలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లో హింసా కాండ మొదలైంది. అక్కడ హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణాలను దోచుకున్నారు. మరియు శుక్రవారం ప్రార్థనల తర్వాత ముస్లిం గుంపులు అల్లర్లు చెలరేగడంతో సంఘాలు పారిపోవాల్సి వచ్చింది. అల్లర్లు లేపి రాళ్లు రువ్వడం, వాహనాలు ధ్వంస చేయడం, నిప్పంటించడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం మమతా బెనర్జీ నోరు మెదపడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హింసాకాండ జరిగిన ప్రాంతం నుంచి భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి చర్యలు ఉగ్రవాదం అదుపు లేకుండా విజృంభిస్తోందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని బిజెపి విమర్శించింది. అల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. సుకాంత మజుందార్, దిలీప్ ఘోష్ , ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ వంటి సీనియర్ రాష్ట్ర బిజెపి నాయకులు టిఎంసి మౌనాన్ని విమర్శించారు. హిందువులను వారి ఇళ్ల నుండి వెళ్ళగొట్టేటప్పుడు టిఎంసి కళ్ళు మూసుకుందని ఆరోపించారు.

Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ముర్షిదాబాద్‌లో అత్యంత దారుణమైన హింస జరిగినప్పటికీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పాట్నా, సిల్చార్, లక్నో, తమిళనాడులోని హోసూర్ వంటి నగరాల్లో నిరసనలు చెలరేగాయి. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని తిరస్కరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అస్సాంలోని సిల్చార్‌లో, నిరసనలు హింసాత్మకంగా మారాయి, పోలీసులతో జనాలు ఘర్షణ పడ్డారు. ఢిల్లీలోని జామా మసీదులో నిరసనలు శాంతియుతంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం ఎన్ని నిరసనలు వస్తున్నా వక్ఫ్ చట్టం విషయంలో వెనక్కి తగ్గేతే లేదని తేల్చి చెప్పింది. బిజెపి నాయకుడు తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆధునిక జిన్నాతో పోల్చారు, మైనారిటీ సంతృప్తి కోసం ఆమె హిందువుల భద్రత తాకట్టు పెట్టారని ఆరోపించారు. ముర్షిదాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల మరణాలపై ఆమె మౌనాన్ని ఆయన ఖండించారు. 

Advertisment
Advertisment
Advertisment