యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్. ఈమెకు ఆధ్యాత్మికత అంటే ప్రాణం. చాలా ఏళ్ళుగా లారెన్ భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్నారు. తన స్నేహితుడైన టిమ్ బ్రౌన్ ద్వారా లారెన్ ఇందులోకి ప్రవేశించారు. కేలాసానందగిరి దగ్గర ఈమె శిష్యరికం చేస్తున్నారు. తన పేరును కూడా కమలా అని మార్చుకున్నారు. కమలా ధ్యానం, క్రియా యోగాల్లాంటివి రోజూ చేస్తారు.
స్టీవ్ జాబ్స్ ఎప్పటిదో కల...
కమలాకు భారతీయ ఆధ్యాత్మికత అన్నా, దేవుళ్ళు అన్నా చాలా నమ్మకం. ఆ కారణంగానే ఆమె మహా కుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చారు. త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఇలా చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కమలా చెప్పారు. నిజానికి కుంభమేళాలో పాల్గొనడం స్టీవ్ జాబ్స్ కు ఎప్పటి నుంచో కల అని ఆమె చెప్పారు. 2021లో ఆయన కుంభమేళాలో పాల్గొనాలని అనుకున్నారు. ఆయనకు బతికి ఉండగా రావడం అవలేదని...ఇప్పుడు తాను స్టీవ్ జాబ్స్ కోరిక తీర్చానని కమలా చెప్పారు.
VIDEO | Maha Kumbh 2025: American businesswoman Laurene Powell Jobs (@laurenepowell) visits Niranjani Akhara in Prayagraj, Uttar Pradesh.#MahaKumbh2025 #Kumbh2025
— Press Trust of India (@PTI_News) January 12, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Dak55I5tJA
అయితే కుంభమేళాకు వచ్చిన స్టీవ్ జాబ్స్ భార్య కమలా అస్వస్థతకు గురయ్యారు. ప్రయాగ్ రాజ్‌లో అత్యధిక సంఖ్యలో జనాలు ఉండడం...ఆమెకు ఇలాంటివి అలవాటు లేకపోవడం వలన ఆమె అనారోగ్యం పాలయింది. అయితే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేశాక తన ఆరోగ్యం బాగుపడిందని కమలా చెప్పారు.
Also Read: Crime: హరియాణా బీజేపీ అధ్యక్షుడు, గాయకుడిపై అత్యాచార కేసు