Standup Comedian: తల్లి మీద జోకులు..వివాదంలో స్టాండ్‌ అప్‌ కమెడియన్‌!

స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా ఓ ప్రదర్శనలో తన తల్లి మీద చెప్పిన జోక్‌ వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు తల్లిదండ్రులను జోక్‌గా చూపించడం హద్దు దాటడం అని అభిప్రాయపడుతున్నారు..

New Update
swati

swati

తాజాగా స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా ఓ ప్రదర్శనలో తన తల్లి మీద చెప్పిన జోక్ వల్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. తన తల్లి నా రూమ్ లో వైబ్రేటర్ కనుగొన్నప్పుడు ఎలా స్పందించిందనే విషయాన్ని హాస్యంగా వివరించడం ఇప్పుడు నెటిజన్లలో కలకలం రేపింది. ఈ వీడియో క్లిప్ శనివారం వైరల్ కావడంతో, ఇది ప్రేక్షకులలో ఆగ్రహం తెప్పించింది. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు తల్లిదండ్రులను జోక్‌గా చూపించడం హద్దు దాటడం అని అభిప్రాయపడ్డారు.

Also Read: Telangana Rain Alert: మండుతున్న ఎండల్లో చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..రానున్న మూడు రోజుల పాటు వానలే వానలు!

స్వాతి సచదేవా చేసిన వ్యాఖ్యలు కామెడీకి హద్దులు ఉండాలా? లేక హాస్యం అనే పేరుతో ఏది చెప్పినా సరేనా? అనే చర్చకు దారి తీశాయి. ఇక అసలు విషయానికి వెళ్తే.. తాజాగా జరిగిన ఓ స్టాండ్-అప్ కమెడియన్ షోలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవలే నా తల్లితో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందని చెప్పుకొచ్చింది. ముందుగా తన తల్లి నా దగ్గరకు వచ్చి ‘స్నేహితురాలిగా’ తనతో మాట్లాడమని అడిగింది. ఆమె కచ్చితంగా వైబ్రేటర్‌ను చూపించి దానిని గాడ్జెట్ లేదా బొమ్మ అని చెప్పినట్లు వివరించింది.

Also Read: Horoscope: నేడు ఈ రాశి వారికి అన్నింటా విజయమే!

అయితే దానికి నేను, అమ్మా.. ఇది నాన్నది అని సమాధానం ఇచ్చినట్లు చెప్పింది. దానికి అమ్మ మూర్ఖంగా మాట్లాడకు, ఆయన గురించి నాకు తెలుసు అని, అది ఆయన సెలక్షన్ కాదని చెప్పినట్లు చెప్పింది. ఆ తర్వాత అమ్మ దాన్ని తీసి నన్ను ప్రశ్నించడం ప్రారంభించిందని చెప్పుకొచ్చింది.

ఈ జోక్‌పై నెటిజన్లు భిన్నమైన స్పందనలు తెలిపారు. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాలో కొందరు “కామెడీ పేరిట అసభ్యతను ప్రచారం చేస్తున్నారు” అంటూ విమర్శించగా.., మరొకరు తల్లి పేరు ఇలా చెప్పి ద్వారా పాపులారిటీ సంపాదించడం తగదని పేర్కొన్నారు. మరొకరేమో ఇది కామెడీ కాదు, తల్లిని అవమానించడమే వ్యాపారంగా మార్చుకున్నారని కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే, 1995లో జన్మించిన స్వాతి సచదేవా ప్రఖ్యాత స్టాండ్-అప్ కామెడియన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు 1,000కి పైగా షోలు ప్రదర్శించిన ఆమె, ప్రధానంగా పాప్ కల్చర్, రోజువారీ జీవితం వంటి విషయాలపై హాస్యం ప్రదర్శిస్తుంటారు.

Also Read: TG Government: జీపీవోలుగా మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు

Also Read: Political Panchangam: రేవంత్, పవన్‌కు తిరుగులేదు.. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే!

stand-up-comedy | swati sachdeva | comedy | mother | latest-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ఈ మధ్య తరుచుగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు మళ్ళీ దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. 

New Update
hdfc

UPI

ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏ యూపీఐ సేవా పని చేయలేదు. అసలు ఏ ట్రాన్సాక్షన్స్ పని చేయలేదు. రీసెంట్ గా మార్చి 26న యూపీఐ ట్రాన్సక్షన్స్ లో ఇదే సమస్య రాగా మళ్లీ ఇవాళ అదే సమస్య రావడంతో కస్టమర్లు మండిపడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 2న  రాత్రి 8 గంటల వరకూ యూపీఐ పని చేయడం లేదని 449 ఫిర్యాదులు నమోదయ్యాయి.

కారణం తెలియ లేదు..

యూపీఐ సేవల్లో 64 శాతం మనీ ట్రాన్స్ ఫర్, 28 శాతం పేమెంట్స్, 8 శాతం యాప్ సమమస్యలు తలెత్తాయి. అలాగే ఎస్బీఐలో 57 శాతం కస్టమర్లు మనీ ట్రాన్సక్షన్ జరపడంలో ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. 34 శాతం మొబైల్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కున్నామని చెప్పారు. అయితే  డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి కారణమేంటని అనేది మాత్రం తెలియలేదు.  దీనిపై సంబంధిత బ్యాంకులు కానీ, యాప్స్ కానీ ఏమీ ప్రకటన చేయలేదు. నేషనల్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.  

 today-latest-news-in-telugu | upi

Also Read: RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170

Advertisment
Advertisment
Advertisment