BIG BREAKING: ఆలయంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 8 మంది మృతి

బిహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నలందలోని శీతల మాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

New Update
stampede broke out at the Sheetla Temple in Nalanda, Bihar

stampede broke out at the Sheetla Temple in Nalanda, Bihar

బిహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నలందలోని శీతల మాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం ఈ ఆలయానికి పూజలు నిర్వహించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విపరీతంగా రద్దీ ఏర్పడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

తొక్కిసలాటకు కారణం ఇదే 

బీహార్‌లోని నలంద నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో మఘ్రా అనే గ్రామంలో శీతల మాత అష్టమి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా చైత్రమాసం చివరి మంగళవారం నాడు అమ్మవారికి భక్తులు ప్రసాదం సమర్పిస్తారు. ముందు రోజు వండిన ఆహారాన్ని అంటే చద్దన్నాన్ని ప్రసాదంగా ఇస్తుంటారు. శీతల మాతకు ఈ ఆహారం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి ఈ ప్రసాదం సమర్పించేందుకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మహిళలు ఎగబడ్డారు. గుడిలో స్థలం తక్కువగా ఉండటం.. వేలాది సంఖ్యలో మహిళలు వచ్చారు. భద్రతా లోపంతోనే ఈ ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. 

Advertisment
తాజా కథనాలు