/rtv/media/media_files/2026/05/03/stage-is-set-for-counting-of-votes-for-4-states-assemblies-and-1-union-territory-tomorrow-2026-05-03-14-40-49.jpg)
Stage is set for counting of votes for 4 states Assemblies and 1 union territory tomorrow
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు తామే గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేరళలో UDF, బీజేపీ శ్రేణులు సంబరాలకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. విందు భోజనాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఏర్పాట్లు చేస్తున్నాయి.
Also Read: చైన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన... ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకేసిన ప్యాసిండర్
మలప్పురం జిల్లాలోని పాండిక్కల్‌లో తాము గెలుస్తామని భావిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కార్యకర్తలు ఏకంగా 5 వేల మంది కోసం బిర్యానీ రెడీ చేస్తున్నారు. బిర్యానీ వండటం కోసం 16 భారీ పాత్రలు కూడా తీసుకొచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. బిర్యానీని పంచేందుకు పట్టణంలో భారీ టెంటును సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా మెజార్టీ సర్వేలు ఈసారి కేరళలో UDF కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. దీంతో పదేళ్లు పాలించిన LDF గద్దె దిగనుందని.. తమ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని యూడీఎఫ్ కార్యకర్తలు చెబుతున్నారు.
Also Read: నేడే 'నీట్-యూజీ 2026'... అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాల్సిందే
కొచ్చిలో కూడా బీజేపీ వేడుకలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వందలాది లడ్డూలను ఆర్డర్ చేసినట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఈసారి తప్పకుండా బీజేపీ ఖాతా తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేమం, కాళకూటం, మంజేశ్వర్, పాలక్కడ్‌తో పాటు పలు స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నారు. మొత్తంగా రేపు తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎవరు అధికారంలోకి రానుందని తేలిపోతుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పోలీసులు, భద్రతా బలగాలు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోనున్నారు.
Follow Us