/rtv/media/media_files/2025/03/27/PUt0szAAvyIxs2gzJW3P.jpg)
Bombay High Court
బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్యాభర్తలిద్దరిలో ఎవరైనా కూడా బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించినా లేదా అలాంటి ప్రయత్నం చేసిన హింస కిందకే వస్తుందని తెలిపింది. హిందూ వివాహ చట్టం, 1955లో సెక్షన్ 13(1)(ia) ప్రకారం మంజూరు చేయవచ్చని న్యాయస్థానం పేర్కొంది. తన భార్య సూసైడ్ చేసుకుంటానని.. తనను తన ఫ్యామిలీని జైలుకు పంపిస్తానని బెదిరిస్తోందని ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు. ఆమెతో కలిసి ఉండటం కుదరదని.. తనకు విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును కోరాడు.
Also Read: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!
ఫ్యామిలీ కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునివ్వగా.. దాన్ని సవాలు చేస్తూ అతని భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా బాంబే హైకోర్టు దీనిపై విచారణ జరిపింది. ఆమె తాను చనిపోయి భర్త కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని బెదిరించడమే కాదు సూసైడ్ చేసుకుంటానని చెబుతోంది. భార్యాభర్తల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అది జీవిత భాగస్వామిని హింసించడం కిందకే వస్తుంది. అందుకే చట్టం ప్రకారం విడాకులు మంజూరు చేయొచ్చని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది.
Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?
మహారాష్ట్రలోని ఆ వ్యక్తి 2009లో పెళ్లి చేసుకున్నాడు. ఆ జంటకు ఓ పాప ఉంది. భార్య తరఫు బంధువులు రావడం వల్ల తమ కాపురం కూలిపోయిందని విడాకుల పిటిషన్‌లో అతడు చెప్పాడు. గర్భంతో ఉన్న భార్య తననకు విడిచి వెళ్లిపోయిందని అప్పటినుంచి ఇంకా తిరిగి రాలేదని అన్నారు. కొంతకాలం తర్వాత తనను తప్పుడు కేసులతో బెదిరిస్తోందని అలాగే సూసైడ్ చేసుకొని ఈ నేరాన్ని నా కుంటుంబంపై నెట్టేస్తానని అంటోందని అతడు వాపోయాడు. దీనికి సంబంధించిన ఆధారాలతో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు నుంచి గత నెలలో విడాకులు పొందగలిగాడు. చివరికి భార్య తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.
Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ!
Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు
latest-news | bombay-high-court | divorce | national-news