పార్లమెంటులో ఉద్రిక్తత.. రాహుల్‌ గాంధీ సస్పెండ్ !

పార్లమెంటు ఆవరణలో జరిగిన తోపులాటపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తోటి ఎంపీలపై దాడి చేసిందుకు స్పీకర్ ఓంబిర్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Rahul gandhi 2

పార్లమెంటు ప్రాంగణంలో గురువారం ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అధికార, విపక్ష ఎంపీల మధ్య తోపులాట చేసుకోవడంతో ఇద్దరు బీజీపీ ఎంపీలు గాయపడ్డారు. విపక్ష నేత రాహుల్ గాంధీ తోయడం వల్లే వీరు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ తోపులాటపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తోటి ఎంపీలపై దాడి చేసిందుకు స్పీకర్ ఓంబిర్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది.   

Also Read: అమిత్‌ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం

మరోవైపు ఈ ఘటనపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీలు దాడి చేశారని, ఇద్దరు ఎంపీలను తోసేశారంటూ ఆరోపించారు. ప్రతాప్ సింగ్ సారంగీ, ముఖేష్ రాజ్‌పుత్‌లకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. రాహుల్ గాంధీపై తగిన చర్యలు తీసుకుంటామని.. గాయపడిన ఎంపీలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. 

Also Read: విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఆ ఫైళ్లు మిస్సింగ్!

ఇదిలాఉండగా రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాజ్యాంగ నిర్మాణ బీఆర్ అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసనలు చేపట్టారు. అదే సమయంలో ఎన్డీయే కూటమి ఎంపీలు కూడా అక్కడికి వచ్చారు. తమని లోపలికి వెళ్లనియకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. 

Also Read: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మృతి

ఈ గందరగోళంలో బీజేపీ ఎంపీలు ముకేశ్ రాజ్‌పుత్, ప్రతాప్ చంద్ర సారంగి కిందపడి గాయాలపాలయ్యారు. దీంతో వీళ్లిద్దరిని ఆస్పత్రికి తరలించారు.  మరోవైపు అంబేద్కర్‌ను అమిత్‌ షా అవమానించేలా మాట్లాడారని.. వెంటనే ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్‌ను అవమానించిందంటూ ఎన్డీయే నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు.  

Also Read: 'ఇండియన్ 2' కి నెగిటివ్ రివ్యూలు.. ఎట్టకేలకు నోరు విప్పిన శంకర్, ఏమన్నారంటే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment