రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అదనంగా జనరల్‌ బోగీలు

జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 9 రైళ్లకు యాడ్ చేయనున్నారు. ఇప్పటి వరకు రెండు జనరల్ కోచ్‌లు ఉండగా.. మరో రెండు కోచ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.

New Update
Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు రెండు జనరల్ బోగీలు ఉండగా.. వీటికి అదనంగా మరో రెండు జనరల్ బోగీలను యాడ్ చేయనుంది. ఇలా జనరల్ బోగీలను యాడ్ చేయడం వల్ల సామాన్య ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొత్తం 31 రైళ్లకు ఇప్పటికే రెండు విడతల్లో జనరల్‌ బోగీల సంఖ్య పెంచారు. మరో 9 రైళ్లకు జనరల్‌ బోగీల సంఖ్యను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.  

ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్‌..ఎంత వింతగా ఉందో చూడండి!

జనవరి 1 నుంచి అమలు

ఇదిలా ఉండగా.. 2025 జనవరి 1 నుంచి కొన్ని మార్పులు అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన రిలీజ్ చేసింది. అందులో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సమయాల్లో మార్పులు జరిగాయి. ఇది విజయవాడ నుంచి వైజాగ్ వరకు ప్రయాణిస్తుంది. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే ప్రయాణికులతో ఈ ట్రైన్ ఎప్పుడూ కిటకిటలాడుతుంది. 

ఇది కూడా చూడండి: Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

ఇప్పుడు ఈ ట్రైన్ సమయాల్లో మార్పులు చేశారు. ఇది వరకు ఈ ట్రైన్ విజయవాడ స్టేషన్‌లో ఉదయం 6.15 గంటలకు ప్రారంభం అయ్యేది. కానీ ఇప్పుడు షెడ్యూల్ మారింది. ఇక నుంచి 15 నిమిషాల ముందుగానే ఈ ట్రైన్ బయల్దేరుతుంది. అంటే కొత్త టైం ప్రకారం.. ఉదయం 6 గంటలకే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 

ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే!

దీంతోపాటు MMTS రైళ్ల సమయాల్లో సైతం మార్పులు జరిగాయి. జనవరి 1 నుంచి ఈ ట్రైన్ ప్రయాణ సమయాల్లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్పులు చేసింది. ఈ మార్పులను NTES (నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్)లో చూసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.

New Update
Exercise Aakraman

పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియా, పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. పర్వతాలు, భూతల లక్ష్యాలను దాడి చేసే సామర్థ్యాలపై దృష్టి పెట్టింది. ఈ ఎక్సర్సైజ్‌లో రాఫెల్ యుద్ధ వివానాలు పాల్గొన్నాయి. పంజాబ్‌లోని అంబాలా, పశ్చిమ బెంగాల్ హషిమారాలో వైమానిక దళం రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లను మోహరించింది. ఇందులో లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడుల వంటి వాటిని నిర్వహించాయి. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన కీలక ఆస్తులు పలు వైమానిక స్థావరాల నుంచి తూర్పు వైపుగా తరలించినట్లు తెలుస్తోంది. 

Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి

రఫెల్ ఫైజర్ జెట్లు సరిహద్దు ప్రాంతాలకు చాలా దగ్గరగా ప్రయాణించాయని తెలుస్తోంది. వైమానిక హెచ్చరిక మరియు నియంత్రణ వ్యవస్థ (AWACS) అమర్చిన విమానాలు శత్రువుల కదలికలపై నిఘా ఉంచాయి. అదే సమయంలో, పాకిస్తాన్ వైమానిక దళ జెట్‌లు కూడా సరిహద్దు దాటి ఎగురుతూ కనిపించాయి. 

( loc | indian-air-force | Exercise Aakraman | attack in Pahalgam | Pahalgam attack | pakistan | india | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment