/rtv/media/media_files/2026/04/23/some-youths-illegally-converted-108-ambulance-into-oyo-room-2026-04-23-18-15-47.jpg)
Some youths illegally converted 108 ambulance into Oyo Room
అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ను యువతీ, యువకులు అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మార్చేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌లో చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ అంబులెన్స్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు గమనించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర బెక్‌లపై దాన్ని వెంబడించారు. చివరికి ఆ అంబులెన్స్‌ను నిలిపివేశారు. వాహనం తలుపులు తెరిచి చూడగా.. లోపల ఇద్దరు యువకులు ఓ యువతితో కలిసి అభ్యంతరకర స్థితిలో కనిపించారు. దీంతో అక్కడున్న స్థానికులు వాళ్లని చూసి షాకైపోయారు.
Also Read: రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు
ఆస్పత్రికి రోగులను చేరవేయాల్సిన అంబులెన్స్‌ను 'ఓయో రూమ్'లా మార్చేసి, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మూవింగ్ ఓయో' అంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
అంబులెన్స్ ను OYO రూమ్ గా మార్చేసిన మధ్యప్రదేశ్ యువత!
— UttarandhraNow (@UttarandhraNow) April 23, 2026
అంబులెన్స్ లో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలను పట్టుకున్న వీడియో వైరల్ #MadhyaPradeshpic.twitter.com/n7LxqP0Us0
Also Read: ఢీకొన్న రెండు వాహనాలు.. స్పాట్‌లో 11 మంది సజీవదహనం
ఈ ఘటనలో డ్రైవర్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. రూల్స్ ఉల్లంఘించి వైద్య సేవలు దుర్వినియోగం చేసినవాళ్లపై కఠినంగా చర్చలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Follow Us