రూ.167 కోట్లకు అమ్ముడుపోయిన రవివర్మ పెయింటింగ్..

ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన పెయింటింగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. యశోద, చిన్ని కృష్ణుడితో ఉన్న ఈ ఆయిల్ పెయింటింగ్‌ ఏకంగా రూ. 167.2 కోట్లకు అమ్ముడుపోయింది.

New Update
Sold for Rs 167.2 crore, Raja Ravi Varma's 'Yashoda and Krishna' sets record

Sold for Rs 167.2 crore, Raja Ravi Varma's 'Yashoda and Krishna' sets record

ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన పెయింటింగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. యశోద, చిన్ని కృష్ణుడితో ఉన్న ఈ ఆయిల్ పెయింటింగ్‌ ఏకంగా రూ. 167.2 కోట్లకు అమ్ముడుపోయింది. బుధవారం ముంబయిలో జరిగిన 'సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్'లో అది ఈ రికార్డు ధర పలికింది. 1890వ దశకంలో గీసిన ఈ చిత్రం.. భారతీయ కళా రంగంలో ఇప్పటిదాకా పలికిన అత్యధిక ధరగా చరిత్ర సృష్టించింది.

Also Read: పాక్‌పై దాడికి సిద్ధమైన ఇండియన్ నేవీ.. వెనక్కి తగ్గడానికి కారణం ఇదే!

రవివర్మ గీసిన ఈ చిత్రాన్ని వేలంలో దక్కించుకునేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పోటీపడ్డారు. చివరికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా దీన్ని దక్కించుకున్నారు. గతంలో ప్రముఖ చిత్రకారుడు M.F హుస్సేన్ గీసిన పెయింటింగ్ రూ. 118 కోట్లకు అమ్ముడుపోయింది. అత్యంత ఖరీదైన భారతీయ కళాచిత్రంగా ఇదే ఇప్పటిదాకా రికార్డులో కొనసాగింది.  రవివర్మ గీసిన పెయింటింగ్ తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలోనే పూనావాలా మాట్లాడుతూ.. ఇలాంటి అరుదైన కళాఖండాన్ని దక్కించుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఇది తనకు దక్కిన గౌరవమన్నారు. 

Also Read: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్‌!

అయితే రాజా రవివర్మ చిత్రాలకు అంతర్జాతీయ వేలంలో ఇంతటి ఆదరణ దక్కడం భారతీయ చిత్రకళా వైభవానికి నిదర్శనమని నిపుణులు కొనియాడుతున్నారు. పురాణ గాథలను అత్యంత సహజంగా, సజీవంగా గీయడంలో రవివర్మ దిట్ట. ఆయన గీసిన ఈ 'యశోద-కృష్ణ' పెయింటింగ్ అనేది భారతీయ సంస్కృతికి, కళాభిరుచికి అద్దం పడుతోంది. 

Advertisment
తాజా కథనాలు