Snake Video : వామ్మో.. రైల్లోనే ప్రత్యక్షమైన పాము.. వీడియో వైరల్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ నుంచి ముంబయికి వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులకు సమాచారం అందిచగా వాళ్లు పామును పట్టుకొని బయట వదిలేశారు. By B Aravind 23 Sep 2024 | నవీకరించబడింది పై 23 Sep 2024 10:52 IST in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి సాధారణంగా పామును చూస్తే కొందరు భయంతో పరుగులు తీస్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో, చెట్ల పొదల్లోనే కాదు.. అప్పుడప్పుడు పలువురి ఇళ్లల్లోకి కూడా పాములు దూరుతుంటాయి. కొంతరైతే పామును చూశాక చంపేస్తుంటారు కూడా. మరికొందరు అడవిలోకి వదిలేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా నడుస్తున్న రైల్లోనే ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జబల్‌పుర్- ముంబయి గరీబ్‌రత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. Also Read: ఆహారంలో బతికి ఉన్న ఎలుక...విమానం అత్యవసర ల్యాండింగ్! ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గరీబ్‌రత్ అనే ఎక్స్‌ప్రెస్ రైలు జబల్‌పుర్ నుంచి ముంబయికి బయలుదేరింది. అయితే మహారాష్ట్రలోని కాసర రైల్వే స్టేషన్‌ను రైలు చేరుకునే సమయంలో ఏసీ కోచ్ జీ-3లో ఒక్కసారిలో పాము ప్రత్యక్షమైంది. పైన బెర్త్ హ్యాండిల్‌కు చుట్టుకొని కాసేపు అలాగే ఉండిపోయింది. దాన్ని చూసి భయపడ్డ ప్రయణికులు వేరే కోచ్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఆ పామును పట్టుకొని బయట వదిలేశామని స్పష్టం చేశారు. Snake On A Train! "Gareeb rath mein ameer kahan se aa gaya ye?" (How has this rich one come to Gareeb Rath (name of train). The sense of humour of Indians is legendary🤣. Jokes apart, a snake found in Jabalpur-Mumbai Garib Rath Express. #snake #snakeVideo pic.twitter.com/xLP9T2A3cD — Abhishek Yadav (@geopolimics) September 22, 2024 #mumbai #train #snake మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి