/rtv/media/media_files/2025/02/27/jtUO1q6jbPFMLuqCuERh.jpg)
Smuggling of Gold at Delhi Photograph: (Smuggling of Gold at Delhi)
Gold Smuggling: పుష్పా సినిమాలో ఎర్రచందనం(Red Sandalwood) స్మగ్లింగ్ ట్విస్ట్‌ను మించిన ట్విస్టులు ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయంలో బయటపడుతున్నాయి. స్మగ్లర్లకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏమో మరి! కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ స్మిగ్లింగ్ వ్యవహారంలో దొరికినోడు దొంగ.. దొరకనోడు దొర అన్నట్టే ఉంటుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రమంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 172 గ్రాముల బంగారన్ని స్వాధీనం చేసుకున్నారు. 56 ఏళ్ల వయసున్న ఓ ప్రయాణికుడు.. జెడ్డా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అతను ఎస్వీ-756 విమానంలో ప్రయాణించాడు. అయితే బ్యాగేజీ చెకింగ్ సమయంలో అతని లగేజీపై అనుమానం వచ్చింది. ఖర్జూర పండ్లలో బంగారాన్ని దాచి.. తీసుకెళ్తున్నట్లు కస్టమ్స్ అధికారులు అనుమానించారు.
Also Read: SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
#WATCH | Based on spot profiling, Customs officers at IGI Airport intercepted one Indian male passenger aged 56 arriving from Jeddah to Delhi on flight SV-756 yesterday. Examination of his baggage led to the recovery of assorted yellow metal cut pieces and a chain, all believed… pic.twitter.com/sxCrpGMKuj
— ANI (@ANI) February 27, 2025
Also read : త్వరలోనే భూమి అంతం.. న్యూటన్ చెప్పింది నిజం అవుతుందా?
ఖర్జూర పండ్లలో బంగారం..
పండ్లు ఉన్న మూటను ఓపెన్ చేసి పరిశీలించారు. ఖజ్జూరు పండ్ల గింజల ప్లేస్‌లో బంగారు అమర్చినట్లు గుర్తించారు. ఓ చైన్ కూడా ఆ ఖర్జూర పండ్ల బ్యాగ్‌లో ఉన్నది. ఖర్జూర పండ్లలో దాచిన ఆ బంగారం మొత్తం 172 గ్రాములు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గతవారం ఇదే విమానాశ్రయంలో విగ్‌లో డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నాడు. తలకు విగ్ అతకించి.. అందులో 200 గ్రాముల కొకేన్ కొలంబియా నుంచి తీసుకువచ్చాడు. మొత్తం 19 క్యాప్యుల్ విలువ 10వేల యూరోలు ఉంటుదని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Also Read: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే
Cocaine under a wig: drug courier arrested in Colombia
— vegas (@vegasyx) February 26, 2025
At Rafael Nunez airport, a 40-year-old man tried to smuggle 200 grams of cocaine on his own head, hiding it under a wig.
The video shows law enforcement officers cutting off the wig under which the drug packages were hidden pic.twitter.com/wkbkwtWvoY
Also Read: Delhi AIIMS: ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అరుదైన ఆపరేషన్.. పొట్టలోని 2 కాళ్లు తొలగింపు