/rtv/media/media_files/2025/01/20/WsRCey0wprkMk6FzTn1w.jpg)
Sharon Raj murder case Photograph: (Sharon Raj murder case)
Kerala Crime News: కేరళలో సంచలనం సృష్టించిన షారన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మాకు నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. తన ప్రియుడు షరోన్ రాజ్ అనే 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన గ్రీష్మాకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మూడో నిందితుడు గ్రీష్మా మేనమామ నిర్మలకుమారన్ నాయర్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రియుడిని కిడ్నాప్ చేసినందుకు10 ఏళ్లు.. దర్యాప్తును తప్పుదారి పట్టించినందుకు మరో ఐదు సంవత్సరాల పాటు కారాగార శిక్షనూ విధించింది కోర్టు.
Also Read : మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ పదేళ్ల నాగసాధు...!
ఈ కేసులో వీరిద్దరిని దోషులుగా పేర్కొంటూ జనవరి 17న నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఏఎం బషీర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేసులో సాక్ష్యాలు లేకపోవడంతో గ్రీష్మా తల్లి సింధును కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తనను ప్రేమించిన వ్యక్తిని గ్రీష్మామోసం చేసిందని, అది సమాజానికి మంచి సందేశం ఇవ్వలేదని కోర్టు అభిప్రాయపడింది. తీర్పు వెలువరించిన వెంటనే గ్రీష్మా కోర్టులోనే కుప్పకూలిపోయింది.
Also Read : ఎంత బరితెగించార్రా : ఛీ.. ఛీ .. స్కూల్లో ఏంటీ పాడు పనులు!
గ్రీష్మతో పరిచయం, రిలేషన్‌షిప్
2022కు సంబంధించిన కేసు ఇది. బీఎస్సీ రేడియాలజీ స్టూడెంట్ అయిన షరోన్ రాజ్ (Sharon Raj) కు కన్యాకుమారిలో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటోన్నప్పుడు అతనికి గ్రీష్మతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి.. ఏడాది పాటు రిలేషన్‌షిప్‌లో కొనసాగారు. అయితే ఇంట్లో వాళ్లు గ్రీష్మకు వేరే సంబంధం చూడటంతో రిలేషన్ బ్రేకప్ చేయడానికి షరోన్ రాజ్ అంగీకరించలేదు. దీంతో అతన్ని చంపేందుకు గ్రీష్మ తన తల్లి, మేనమామ, తల్లితో కలిసి ప్లాన్ చేసింది.
Also Read : World Economic Forum 2025: చంద్రబాబుతో రేవంత్ భేటీ!
షరోన్ రాజ్ ను ఇంటికి పిలిచి కూల్ డ్రింక్ లో పారాక్వాట్ డైక్లోరైడ్ అనే ఆయుర్వేద మందును ఇచ్చింది. ఇది తాగి షరోన్ మరణించాడు. ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా షరోన్ రాజ్ చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. గ్రీష్మ, నిర్మల్ కుమరన్ నాయర్, ఆమె తల్లి 2022 అక్టోబర్ 31వ తేదీ నేరం చేసినట్లుగా అంగీరించారు. తాజాగా కోర్టు తాజాగా గ్రీష్మకు మరణ శిక్షను ఖరారు చేసింది.
శిక్షపై సంతృప్తి వ్యక్తం చేసిన షారన్ తల్లిదండ్రులు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. నా కుమారుడికి తగిన న్యాయం జరిగింది’ అని అతని తల్లి చెప్పింది.
Also Read : రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!