Bangladesh nationals : ఓలా, ఉబర్ డ్రైవర్ల ముసుగులో...బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాలో వెలుగులోకి సంచలన విషయాలు...

బంగ్లాదేశీయుల అక్రమ రవాణాపై ఎన్ఐఏ, ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌ బండ్లగూడ కేసులో బంగ్లాదేశ్‌ అమ్మాయిల అక్రమ రవాణాలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓలా, ఉబర్ డ్రైవర్ల ముసుగులో పక్కా ఫ్లాన్‌తో అమ్మాయిలను బార్డర్ దాటిస్తున్నట్లు గుర్తించారు.

New Update
Bangladesh

Bangladesh

Bangladesh nationals : బంగ్లాదేశీయుల అక్రమ రవాణాపై ఎన్ఐఏ, ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌ బండ్లగూడ కేసులో బంగ్లాదేశ్‌ అమ్మాయిల అక్రమ రవాణాలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ఫ్లాన్‌తో బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను బార్డర్ దాటిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడికి తీసుకు వచ్చాక వారి చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. అయితే బంగ్లాదేశ్‌ నుంచి వారిని ఇండియాకు ఎలా తీసుకువస్తున్నారనే విషయంపై ఆరాతీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

ఇటీవల హైదరాబాద్ నగరంలో సెక్స్ రాకెట్ కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను పనికోసం హైదరాబాద్ తీసుకొచ్చి వారితో.. వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో బంగ్లాదేశ్ అమ్మాయిల అక్రమ రవాణా విషయాలు మొత్తం వెలుగులోకి వచ్చాయి. కాగా నెల క్రితం పాతబస్తీలో పదుల సంఖ్యలో బంగ్లాదేశ్ అమ్మాయిలు, యువతులతో సెక్స్ రాకెట్  నడుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్  చేయగా.. అక్రమంగా భారత్ లోకి బంగ్లాదేశీయులు ఎలా వస్తున్నారనే దానిపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది.

ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
 
హైదరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్న బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణా కేసుపై ఈడీ అధికారులు  దృష్టి సారించారు. కొద్ది రోజుల క్రితం బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో నమోదైన యువతుల అక్రమ రవాణా కేసులో ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. బ్యూటిషియన్, టైలరింగ్ శిక్షణ పేరుతో వారు హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. అలాగే వివిధ వృత్తుల పేరుతో బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించిన ముఠా వారితో వ్యభిచారం చేయించారు. కొద్దిరోజుల క్రితం పోలీసులకు సమాచారం అందగా.. దాడులు చేసి పలువురిని పట్టుకొని విచారించారు. వ్యభిచారం కేసులో బంగ్లాదేశ్ నుంచి మహిళల అక్రమ రవాణా చేసినట్లు తేలింది.  

Also Read: USA: మళ్ళీ వాయిదా పడ్డ ప్రయోగం..సునీతా విలియమ్స్ రాక ఇంకా ఆలస్యం


బంగ్లాదేశీయుల అక్రమ రవాణా విషయంలో ఎన్‌ఐఏ, ఈడీ రంగంలోకి దిగాయి. ఇటీవల హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్, ఖైరతాబాద్, సనత్‌నగర్ ప్రాంతాల్లో 20మంది బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు కేసులు నమోదు చేసి విచారించగా..జాబ్ ఆఫర్ల పేరుతో బంగ్లాదేశ్ నుండి అమ్మాయిలను బార్డర్ దాటిస్తున్నట్లు గుర్తించారు.  ఈ కేసులో పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.  బంగ్లా యువకులు ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పని చేస్తూ అమ్మాయిలను ఇండియాకు చెర వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Also read: TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి

వీరంతా భారత్‌కు వచ్చి ఆధార్ కార్డులను సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. మరోవైపు.. బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ అధికారులు కూడా దూకుడు పెంచారు. వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బును నిందితులు పలు మార్గాల్లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నట్టు గుర్తించింది. దాంతో.. మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోణంలో దర్యాప్తు చేస్తోంది ఈడీ. హైదరాబాద్‌లోని ఏజెంట్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. పేటీఎం వాలెట్‌లోని లక్షా 90వేల రూపాయలను సీజ్ చేసింది.

ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్?

భారత బాక్సర్ మేరీకోమ్ వీడాకులు తీసుకోబోతున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వివాదమే మేరీకోమ్ దంపతులను దూరమయ్యేలా చేసిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ విడిగా ఉంటున్నారు. నలుగురు పిల్లలు మేరీకోమ్ దగ్గరే ఉంటున్నారు.

New Update
Mary Kom: కీలక పోస్టుకు రాజీనామా చేసిన బాక్సర్‌ మేరీ కోమ్..

Mary kom

భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ త్వరలోనే ఆమె దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని.. వీరి నులుగురు పిల్లలు కూడా ప్రస్తుతం మేరీ కోమ్ వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి విడాకుల గల కారణాల గురించి అనేక ఊహాగానాలు వస్తున్నా.. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వివాదమే వారిని దూరమయ్యేలా చేసిందంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. 

బాక్సర్ మేరీ కోమ్ 2005 సంవత్సరంలో ఆంఖోలర్ అకా ఓన్లర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అందులో ముగ్గురు అబ్బాయిలు కాగా ఒకరు అమ్మాయి. అయితే ఇంతకాలం హాయిగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలైనట్లు సమాచారం. ముఖ్యంగా వీరిద్దరూ త్వరలోనే విడిపోబోతున్నారని, అధికారికంగా ఈ విషయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. 

నలుగురు పిల్లలతో మేరీకోమ్ విడిగా..

ప్రస్తుతం మేరీకోమ్ తన భర్తతో కలిసి ఉండట్లేదని.. ఇటీవలే తన నలుగురు పిల్లలను తీసుకుని ఫరీదాబాద్‌లోని పుట్టింటికి వెళ్లిపోయిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆమె భర్త అకా ఓన్లర్ మాత్రం ఢిల్లీలోనే ఉంటున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం 2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలే అని అంతా భావిస్తున్నారు. అసలు వీరికి, ఆ ఎన్నికలు సంబంధం ఏంటా అనే అనుమానం వస్తోందా.. ఉందండి.. ఆ ఎన్నికల్లో మేరీకోమ్ భర్త అకా ఓన్లర్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచారం కోం 2 నుంచి 3 కోట్ల రూపాయలకు వరకు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. 

ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ఓడిపోవడంతో.. మేరీకోమ్ తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతున్నాయని.. అవి తట్టుకోలేకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అకా ఓన్లర్‌కు ముందు నుంచే ఇష్టం లేదని.. కానీ మేరీకోమ్‌యే బలవంత పెట్టి ఆయనతో పోటీ చేయించిందని తెలుస్తోంది. ఆమే బలవంతం పెట్టి రంగంలోకి దింపి.. ఓడిపోయిన తర్వాత భర్తతో గొడవ పడిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే మేరీకోమ్ కోసం ఆయన భర్త ఎంతో చేశారని.. ఆయన ఫుట్‌బాల్ కెరియర్‌ను కూడా పిల్లల బాగోగుల కోసం వదులుకున్నట్లు రాసుకొస్తున్నాయి. 

మరోవైపు మేరీకోమ్‌కు మరో మహిళా బాక్సర్ భర్తతో స్నేహం ఉందని.. దాని వల్లే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి.ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియకపోయినప్పటికీ.. వీరి విడాకులు మాత్రం ఖాయం అంటున్నారు.

today-latest-news-in-telugu | boxer | mary-kom

Also Read: TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Advertisment
Advertisment
Advertisment