ముగిసిన జ్యోతి-అలోక్ మౌర్య వివాదం.. పిల్లల కోసం ఒక్కటైన దంపతులు!

ఉత్తరప్రదేశ్‌లో పీసీఎస్ (రాష్ట్ర సివిల్ సర్వీస్) అధికారిణి జ్యోతి మౌర్య, ఆమె భర్త అలోక్ మౌర్యల మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ వివాదం చివరికి ముగింపు దశకు చేరింది. ఇరువైపుల పరస్పర అవగాహనకు వచ్చారు.

New Update
SDM Jyoti Maurya vs Alok Maurya, What Changed? PCS Officer Couple Back Together

SDM Jyoti Maurya vs Alok Maurya, What Changed? PCS Officer Couple Back Together

ఉత్తరప్రదేశ్‌లో పీసీఎస్ (రాష్ట్ర సివిల్ సర్వీస్) అధికారిణి జ్యోతి మౌర్య, ఆమె భర్త అలోక్ మౌర్యల మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ వివాదం చివరికి ముగింపు దశకు చేరింది. ఇరువైపులా పరస్పర అవగాహనకు వచ్చారు. దీంతో ఇద్దరూ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాగ్‌రాజ్ జిల్లా కోర్టు, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను ఉపసంహరించుకునే ప్రక్రియను కూడా ప్రారంభారు.

తమ ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు దృష్ట్యా ఈ రాజీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అలోక్ మౌర్య తెలిపారు. 2023లో వీళ్ల వైవాహిక కలహాలు రచ్చకెక్కడం, ఇరువురు పరస్పర ఆరోపణలు చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విడాకుల పిటిషన్ల నుంచి భరణం కోరుతూ వేసిన పిటిషన్ల దాకా ఈ వివాదం అప్పట్లో హైకోర్టుకు చేరింది. అంతేకాదు పురుషుల హక్కుల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అలోక్ మౌర్య రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కూడా కలిశారు.

Also Read: పార్లమెంటులో చారిత్రాత్మక ఘట్టం.. తొలి 'క్వీర్' ఎంపీగా మేనకా గురుస్వామి ప్రమాణస్వీకారం

మొత్తానికి పాత సమస్యలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం జ్యోతి మౌర్య ఘజియాబాద్ జిల్లాలో ADM (అడ్మినిస్ట్రేషన్) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కుమార్తెలిద్దరూ ఆమె వద్దే ఉంటూ చదువుకుంటున్నారు. పిల్లల పెంపకం, వాళ్ల బాధ్యతలే ప్రాధాన్యతగా ఇద్దరూ సయోధ్యకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అలోక్ మౌర్య ప్రయాగ్‌రాజ్ పంచాయతీ రాజ్ శాఖలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రిలిమినరీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించారు. తన భార్య లాగే ఉన్నతాధికారి కావాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. 

2010లో అలోక్ మౌర్య పంచాయతీ రాజ్ శాఖలో పారిశుధ్య కార్మికుడిగా చేరారు. అదే ఏడాది జ్యోతితో ఆయనకు పెళ్లి జరిగింది. వివాహం తర్వాత జ్యోతి ఉన్నత చదువులు చదవాలని భావించింది. ఇది గమనించిన అలోక్.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆమెను ప్రయాగ్‌రాజ్‌లో కోచింగ్‌కు పంపించారు. 2015లో ఆమె ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. రాష్ట్ర సివిల్ సర్వీసెస్‌లో అధికారిణిగా (SDM) బాధ్యతలు చేపట్టారు. 

Also Read: సాతన్‌కుళం ‘కస్టడీ’ మారణకాండ.. ప్రైవేట్ పార్ట్స్‌పై రక్తం, ఆ రాత్రి ఏం జరిగింది?

అయితే జ్యోతి మౌర్య అధికారిణి అయ్యాక కొన్నేళ్లకు దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. 2023లో అలోక్ మౌర్య బహిరంగంగా తన భార్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు మరొక హోంగార్డ్ కమాండెంట్‌తో సంబంధం ఉందని.. వాళ్లిద్దరూ కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపించారు. జ్యోతి మౌర్య దీన్ని తీవ్రంగా ఖండించారు. పెళ్లి చేసుకునే సమయంలో అలోక్ తనను తాను ఒక అధికారిగా చెప్పుకుని మోసం చేశాడని చెప్పారు. కానీ ఆయన ఒక పారిశుధ్య కార్మికుడని తనకు తెలియదంటూ వాదించారు. 

అంతేకాదు అలోక్ తనను కట్నం కోసం వేధిస్తున్నాడని, తన ఫోన్‌ను హ్యాక్ చేసి వ్యక్తిగత విషయాలను బయటపెట్టారంటూ పోలీసు కేసు పెట్టారు. దీంతో వీళ్ల మధ్య వివాదం అలా కొనసాగుతూనే వచ్చింది. చివరికీ వీళ్లిద్దరూ తమ వివాదాన్ని ముగింపు పలుకుతూ.. గత సమస్యలను మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు