/rtv/media/media_files/2025/03/13/nuLExQ6nKy87KhmMVyMa.jpg)
Sambhal Masjid Photograph: (Sambhal Masjid)
ఇండియాలో హోలీ పండుగు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది హిందువుల పండుగ అయినప్పటికీ అన్నీ మతాలవారు కలిసిమెలిసి చిన్న పెద్దా తారతమ్యం లేకుండా జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగ ముస్లీం రంజాన్ పండుగ వేళ వచ్చింది. హిందువులకు హోలీ ఎంతో ప్రసిద్ధో.. ముస్లీంలకు రంజాన్ అంత పవిత్రగా భావిస్తారు. అందులోనూ హోలీ శుక్రవారం రోజు రావడం. శుక్రవారం ముస్లీంలు ఎంతో పవిత్ర రోజుగా నమాజ్ చేస్తారు. మతఘర్షణకు తావులేకుండా ఉత్తరప్రదేశ్‌లో ఇరు మతాల పెద్దలు కలిసి పోలీసుల సమక్షంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. సంభాల్‌లో ఇటీవల కాలంలో అనేక మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇలాంటివి రిపీట్ కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
Also read: Holi : హోలీ రోజున పోలీసుల ఆంక్షలు.. ఇలా చేస్తే పోలీస్ కేసు ఫైల్
This was never happening before 2014 that mosques in India were being covered before Holi.
— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) March 12, 2025
BJP has destroyed this country 👇
pic.twitter.com/ezd1n7tR3w
Also read: Lift accident: లిఫ్ట్‌లో మరో పసి ప్రాణం బలి.. మొన్న గంగారం, నేడు సురేందర్
ఇరు మతాల పెద్దలను పిలిచి వారి అంగీకారంలో సంభాల్‌లోని జామా మసీదుతోపాటు 10 మసీదులకు టార్పలిన్ కవర్లు కప్పి రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రంగులు చల్లుతారని భయం ఉంటే హోలీ రోజు ముస్లీంలు బయటకు రావద్దని సూచించారు. సంభాల్ పోలీసు వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు. వాటిని సపోర్ట్ చేస్తూ కొందరూ, ఖండిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే శంభాల్‌లో మతకల్లోలాలకు సృష్టిస్తారని అనుమానం ఉన్న 1,015 మందిని యుపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సంభాల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వందన మిశ్రా తెలిపారు.