దాడిలో తీవ్రంగా గాయపడ్డ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కు మొత్తం ఆరు చోట్ల ఆపరేషన్లు చేశారు ముంబైలోని లీలావతి ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆసుపత్రి నుంచి సైఫ్ ఇంటికి వచ్చేశారు. డాక్టర్లు అతనికి రెస్ట్ అవసరమని చెప్పారు. తాజాగా ముంబై పోలీసులు (Mumbai Police) సైఫ్ ఇంటికి వెళ్ళారు. నటుడి దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. దాడి మొత్తం వివరాలను సైఫ్ పోలీసులకు వివరించారు.
Also Read : నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు
Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
అర్ధరాత్రి దాడి జరిగింది...
జనవరి 16 అర్ధరాత్రి తాను, కరీనా కపూర్ (Kareena Kapoor) గదిలో ఉన్నప్పుడు జేహ్ గదిలో నుంచి కేకలు వినిపించాయి. దాంతో తాను బయటకు వచ్చానని..ఆ తర్వాత రాత్రి 2.30 గంటల సమయంలో తనపై దాడి జరిగిందని సైఫ్ చెప్పారు. జేహ్ గదిలో ఉన్న దుండుగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించాను. అను నామీద అటాక్ చేశాడు. నా వీపు, మెడ, చేతులపై తీవ్రంగా పొడిచాడు. అయినా అతనిని బంధించాలని బాగ ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చారు. దాడి జరిగిన తర్వాత 40 నిమిషాలకు ఆసుపత్రిలో చేరారు సైఫ్.
మరోవైపు పోలీసులకు సమర్పించిన మెడికల్ రిపోర్టులో సైఫ్‌ని అతని మేనేజర్, స్నేహితుడు కలిసి లీలావతి ఆసుపత్రిలో చేర్చినట్లు ఉంది. అడ్మిషన్ తర్వాత ఫార్మాలిటీలను పూర్తి చేసిన వ్యక్తి స్నేహితుడి విభాగంలో తన వివరాలను నమోదు చేశారు. ఇక దాడికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్ కు చెందిన 30 ఏళ్ళ మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ గా గుర్తించారు పోలీసులు. మహ్మద్ షరీఫుల్ ఏడు నెలల క్రితమే మేఘాలయలోని డౌకీ నది దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. అతడు భారత్‌లో విజయ్‌దాసుగా పేరు మార్చుకున్నట్లు తెలిపారు.
Also Read : భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!
Also Read : ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!