పురుషులకూ అనుమతి లేని ఆలయాలున్నాయ్‌.. ‘శబరిమల’ అంశంపై కేంద్రం కీలక ప్రకటన

కేరళలోని శబరిమల ఆలయంలో 10 నుంచి 15 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రవేశం లేకపోవడాన్ని కేంద్రం మళ్లీ సమర్థించింది. ఈ విధానాన్ని పాటించడం మహిళలపై చూపిస్తున్న వివక్ష కాదని.. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని గౌరవించడమని తెలిపింది.

New Update
Sabarimala judgement proceeds on assumption that men are superior, Centre tells Supreme Court

Sabarimala judgement proceeds on assumption that men are superior, Centre tells Supreme Court

కేరళలోని శబరిమల ఆలయంలో 10 నుంచి 15 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రవేశం లేకపోవడాన్ని కేంద్రం మళ్లీ సమర్థించింది. ఈ విధానాన్ని పాటించడం మహిళలపై చూపిస్తున్న వివక్ష కాదని.. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని గౌరవించడమని తెలిపింది. అంతేకాదు భారత్‌లో పురుషులు వెళ్లేందుకు అనుమతి లేని ఆలయాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టుకు చెప్పింది.  

Also Read: గ్యాంగ్‌స్టర్ల గుండెల్లో వణుకు: ఒక్కరోజే 501 దాడులు.. 202 మంది అరెస్ట్!

శబరిమల ఆలయంలో మహిళలపై వివక్ష కేసు అంశంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనానికి సమర్పించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల గురించి ప్రస్తావించారు. మన దేశంలో పురుషులకు అనుమతి లేని పలు ఆలయాలు కూడా ఉన్నాయని తెలిపారు. దేవి భగవతి గుడిలో కొన్నేళ్లుగా ఈ ఆచారం ఉందన్నారు. కేరళలోనే ఓ ఆలయంలో అబ్బాయిలు మహిళల వేషధారణలో వెళ్తారని చెప్పారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లి అమ్మాయిల్లా తయారవుతారన్నారు. అందుకే ఇది పురుషాధిక్య లేదా స్త్రీ ఆధిక్య మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదని పేర్కొన్నారు.  

Also Read: 14 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఆ అడవుల్లో ఏం జరుగుతోంది?

ఇదిలాఉండగా శబరిమలలో 10-15 ఏళ్ల మహిళలకు ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని 2018లో సుప్రీంకోర్టు ఎత్తివేస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వయసు మధ్యలో ఉన్న మహిళలకు ఆలయంలోకి అనుమతించకపోవడాన్ని అంటరానితనంగా, ఆర్టికల్‌ 17ను ఉల్లంఘించినట్లు అవుతుందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. కానీ  తీర్పుపై అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు కూడా దాఖలయ్యయి. ఈ క్రమంలోనే ఈ వివాదస్పద అంశాన్ని 2019 నవంబర్‌లో అప్పటి సీజేఐ రంజన్ గొగొయ్‌ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై విస్తృ ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. 

Advertisment
తాజా కథనాలు