RSS: భారతీయులు ఆ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి: మోహన్ భగవత్

ఈ మధ్య జరుగుతున్న మందీర్-మసీద్‌ వివాదాలపై RSS చీఫ్ మోహన్‌ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచానికి భారత్‌ సామరస్యంగా ఉంటుందని చాటిచెప్పాలన్నారు. దేశంలో మైనార్టీ ఎవరు ?.. మెజార్టీ ఎవరు ?. అందరూ సమానమేనన్నారు.

New Update
MOHAN

ఈమధ్యకాలంలో మందీర్-మసీద్‌ వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణం అనంతరం ఇలాంటి వివాదాలను తీసుకొచ్చి తాముకూడా హిందూ నాయకలం అవ్వొచ్చని కొందరు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పుణెలోని 'ఇండియా - ది విశ్వగురు' అనే అంశంపై సహజీవన్ వ్యాఖ్యానాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  

ఇది కూడా చూడండి:  AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

RSS Chief Mohan Bhagwat

ప్రపంచ దేశాలకు భారత్‌ సామరస్యంగా ఉంటుందని చాటిచెప్పాల్సిన అవసరం ఉందని మోహన్ భాగవత్ అన్నారు. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్‌లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటామన్నారు. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నామని తెలిపారు. '' దేశంలో ప్రతీరోజు ఒక కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించాలి. ఇలాంటివి ఇంకా కొనసాగకూడదు. మనమందరం కలిసి మెలసి ఎలా ఉంటామో భారత్‌ ప్రపంచానికి చూపించాలి. 

ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. ఇందులో ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను ప్రజలే ఎన్నుకుంటారు. దేశంలో ఎవరో ఒకరు ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతీఒక్కరూ కూడా తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు ?. దేశంలో మైనార్టీ ఎవరు ?.. మెజార్టీ ఎవరు ?. అందరూ సమానమే. ఎవరైనా కూడా తమకు ఇష్టమైన దేవుడిని ఆరాధించవచ్చు. ఇదే మన దేశ ఆచారం. కానీ నిబంధనలు, చట్టాలకు లోబటి సామరస్యంగా జీవించడం కూడా అవసరమేనని'' మోహన్ భగవత్ అన్నారు.      

ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Watch Video: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ చెట్టు కింద చీతా దాని నాలుగు పిల్లలు సేద తీరుతున్నాయి. అటవీశాఖకు చెందిన ఓ డ్రైవర్ వాటికి నీళ్లు అందించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఉన్నతాధికాలు అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

New Update
Madhya Pradesh villager offers water to cheetah

Madhya Pradesh villager offers water to cheetah

వేసవి కాలం రావడం వల్ల మూగజీవాలకు నీళ్లు దొరకగా అవస్థలు పడుతున్నాయి. సాధారణంగా కొంతమంది జంతు ప్రేమికులు మూగజీవుల కోసం ఆహారం, నీటి వసతులను ఏర్పాటు చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అందులో ఉన్న చీతాలకు నీళ్లు అందించినందుకు ఓ డ్రైవర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఓ చెట్టు కింద చీతా దాని నాలుగు పిల్లలు సేద తీరుతున్నాయి. ఈ క్రమంలోనే అటవీశాఖకు చెందిన ఓ డ్రైవర్ వాటిని గమనించి ఓ క్యాన్‌లో నీళ్లు తీసుకొచ్చాడు. ఓ పాత్రలో ఈ నీటిని పోసీ చీతాలకు తాగించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఆయన చేసిన మంచి పనిని ప్రశంసిస్తున్నారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం ఆ డ్రైవర్‌పై మండిపడ్డారు. ఏకంగా అతడిని ఉద్యోగంలో నుంచే సస్పెండ్ చేశాడు. 

దీనిపై అటవీశాఖ అధికారి ఓ ప్రకటన చేశారు. '' చీతాలకు నీళ్లు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు ఎవరికీ హాని కలిగించేవి కావని వాళ్లు తెలుసుకుంటున్నారు. ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని కూడా వాళ్లందరూ గ్రహించారు. వాటితో స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని'' అటవీశాఖ అధికారి అన్నారు. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

మరోవైపు ఇటీవల చీతాను దాని పిల్లలు ఓ జంతువు వెంట పడుతూ గ్రామంలోకి వచ్చాయి. దీంతో వాటిని పొలంలో చూసిన కొందరు స్థానికులు భయపడ్డారు. ఆ తర్వాత చీతాలపై రాళ్లతో దాడులు చేశారు. దీంతో అవి అక్కడి నుంచి పారిపోయాయి. తాజాగా వాటిని నీరు అందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


 

 rtv-news | national-news | kuno-national-park 

Advertisment
Advertisment
Advertisment