/rtv/media/media_files/2026/04/10/roadside-vendor-beheads-driver-in-bihar-2026-04-10-18-28-00.jpg)
Roadside vendor beheads driver in Bihar, gets killed by locals
బిహార్‌లోని అరేరియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ వీధి వ్యాపారి.. డ్రైవర్‌పై కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతడి తన నరికేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత స్థానికుడు నిందితుడిని తీవ్రంగా కొట్టడంతో అతడు కూడా మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని గురువారం ఉదయం ఫోర్బ్స్‌గంజ్ అనే మార్కెట్ ప్రాంతంలో రోడ్డు పక్కన వ్యాపారం చేసే రవి, వ్యాన్ డ్రైవర్ నబీ హుస్సేన్ మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరి మధ్య గొడవ తీవ్రతరం కావడంతో రవి.. నబీ హుస్సైన్‌పై కత్తితో పలుమార్లు పొడిచాడు.
Broad Daylight Beheading in Bihar’s Forbesganj – Parking Row Turns Deadly
— Siraj Noorani (@sirajnoorani) April 10, 2026
A shocking double murder in Bihar's Araria district has left people in fear and raised serious questions about law and order.
The incident took place on Thursday in Forbesganj town, where a small
1/10 pic.twitter.com/GdHJAJVAA1
Also Read: యమునా నదిలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 9 మంది మృతి
రోడ్డు మధ్యలో నబీ పడిపోగా.. అతడి తల తెగేవరకు రవి కత్తితో కోశాడు. చివరికి తెగిన తలను చేతిలో పట్టుకొని ఆ రోడ్డుపై తిరిగాడు. అక్కడున్న స్థానికులు అతడిని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం నబీ హుస్సేన్ కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి రవిపై తీవ్రంగా దాడి చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రవిని కాపాడారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అతడికి తీవ్రంగా గాయలవ్వడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
Also Read: లేడీ స్మగ్లర్ల భారీ స్కెచ్.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ. 38 కోట్ల గోల్డ్ సీజ్!
దీనిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఎక్స్‌లో ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు షేర్ చేశారు. రాష్ట్రంలో NDA పాలనను విమర్శించారు. ''ఒక వ్యక్తి నడిరోడ్డుపై వందలాది ముందు మరో వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. తెగిన తలతో తిరిగాడు. ఈ ఘటన తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు హంతకుడిని హత్య చేశారంటూ'' రాసుకొచ్చారు. సీఎం సీటు కోసం అధికార కూటమి నేతలు నిమగ్నమై ఉండగా.. రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow Us