/rtv/media/media_files/2025/02/08/UYKocODbyi9RE8AIhSPC.jpg)
Arvind Kejriwal
2011లో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అన్నా హజారే దీక్ష చేస్తున్నారు. అప్పుడు కళ్ళజోడు పెట్టుకున్న ఓ మధ్య వయస్కుడు అందరి దృష్టీ ఆకర్షించారు. దాని తరువాత ఆమ్ ఆద్మీ అని పార్టీని స్థాపించి...ఢిల్లీ రాజకీయాలను ఓ మలుపు తిప్పారు. పార్టీ పెట్టి...అనతి కాలంలోనే వేగంగా ఎదిగారు. దేశ రాజకీయాల్లో సంచలన నేతగా ఎదిగి...పదేళ్ళు సీఎంగా చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్...ఆ పార్టీకి బలమూ...బలహీనత రెండూ.
కాంగ్రెస్ పాలనలో అవినీతికి విసిగిపోయి...ప్రజల్లో ఆవేశాన్ని రగలించడంలో అన్నా హజారే, కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు. తరువాత అన్నా హజారే పిక్చర్ లో నుంచి తప్పుకున్నారు కానీ కేజ్రీవాల్ మాత్రం తన క్రేజ్ ను నిలబెట్టుకున్నారు. మొదటిసారి రాజధానిలో ఆప్ కు బ్రహ్మరథం ఏమీ పట్టలేదు..కానీ ఒక ఛాన్స్ ఇద్దామన్న ఆలోచనతో అధికారాన్ని అప్పజెప్పారు. దానికి తగ్గట్టే మొదటి టర్మ్ లో కేజ్రీవాల్ ఢిల్లీని చాలా బాగా పాలించారు. అప్పట్లో బీజేపీకు సరైన నాయకత్వం లేకపోవడం, కాంగ్రెస్ పై తీవ్రమైన వ్యరేకత ఉండడంతో ఆ రెండింటి మధ్య కావాల్సినంత స్థలాన్ని కేజ్రీవాల్ చేజిక్కించుకోగలిగారు.
రెండోసారి కూడా ఢిల్లీ ప్రజల ఆత్మ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. కానీ తరువాతే అంతా తారు మారు అయింది. ఢిల్లీలో మధ్యతరగతి ఓటర్లు చాలా ఎక్కువగా ఉంటారు. ఈ ఉద్యోగులు అంతా..కేజ్రీవాల్ సారధ్యంలో ఆమ్ ఆద్మీకి చాలా సపోర్ట్ ఇచ్చారు. మొదటిసారి 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గానూ 28 సీట్లు గెలుచుకుని అధికారాన్ని స్వంతం చేసుకున్నారు కేజ్రీవాల్. తరువాత 2015లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 67 సీట్లు గెలుచుకుని దేశం మంతా ఉలిక్కిపడేలా చేశారు. తరువాత 2020లో జరిగిన ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విజయం సాధిస్తామని...మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటామన్న తరుణంలో ఓటమి పాలయ్యారు.
వేటిని అయితే వ్యతిరేకించారో...అందులోనే కూరుకుపోయారు..
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో లైమ్ లైట్ లోకి వచ్చారు కేజ్రీవాల్. ప్రజల్లో విశ్వాసం చూరగొన్నారు. కానీ మళ్ళీ అదే అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయి ప్రజల్లో వ్యతిరేకత పెంచుకున్నారు. మూడోసారి సీఎంగా ఉన్న పదవీకాలంలో ఆమ్‌ఆద్మీ అవినీతి ఆరోపణలతో కూరుకుపోయింది. పలువురు మంత్రులతో పాటు సీఎంగా ఉన్న కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సివచ్చింది. జన్‌లోక్‌పాల్ అని నినదించిన కేజ్రీవాల్ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చుబెట్టి తన అధికార నివాసం శీష్ మహల్ మరమ్మతులు చేసుకోవడం అన్నింటికంటే సెన్సేషనల్ అయింది. దీని కోసం ఏకంగా 33 కోట్లు ఖర్చు పెట్టడం వివాదాస్పదమైంది. ఢిల్లీ ఓటర్లలో ఎక్కువమంది విద్యాధికులు కావడంతో ఈ అంశాన్ని బాగా ఒంటపట్టించుకున్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దేశ రాజకీయాల్లో ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నారు. ఒక్క ఢిల్లీలోనే కాకుండా..మొత్తం దేశమంతా ఆప్ హవా నడిపించాలని అనుకున్నారు. కానీ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి...అట్టడుగుకు వెళ్ళిపోయారు. ఎంత వేగంగా ఎదిగారో..అంతే వేగంగా దిగిపోయారు కేజ్రీవాల్.
Also Read: Cricket: ఈరోజు ఇంగ్లాండ్ తో రెండో వన్డే..కోహ్లీ పైనే అందరి దృష్టి