/rtv/media/media_files/2026/04/05/retired-judge-celebrates-daughter-divorce-2026-04-05-16-36-56.jpg)
Retired judge celebrates daughter's divorce with drums and sweets
ఈ మధ్యకాలంలో విడాకులు అనేవి సాధారణంగా మారిపోయాయి. ఏటా విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ తండ్రి తన కూతురు విడాకులు తీసుకుందని సంబరాలు చేసుకున్నారు. రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుమార్తె ప్రణిత శర్మకు విడాకులు మంజూరు కాగా.. డప్పులు వాయిస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ ఘనంగా పుట్టింటికి ఆహ్వానించారు. "ఐ లవ్ మై డాటర్" అని రాసి ఉన్న టీషర్టులను కుటుంబ సభ్యులు ధరించి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రణిత శర్మకు 2018లో ఒక ఆర్మీ మేజర్‌తో పెళ్లి జరిగింది. అత్తారింట్లోకి ఆమె అడుగుపెట్టాక అత్తామామల వేధించడం ప్రారంభించారు. ఒక కొడుకు పుట్టిన తర్వాత కూడా పరిస్థితులు మారలేవు. దీంతో మానసిక, శారీరక వేధింపులను భరించలేక ఆమె న్యాయపోరాటానికి దిగింది. సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత మీరట్ ఫ్యామిలీ కోర్టు ఏప్రిల్ 4న ఆమెకు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఆమె తండ్రి తన కుమార్తెకు స్వేచ్ఛ లభించిందని సెలబ్రేషన్లు చేశారు.
#Watch: Meerut family celebrates daughter’s divorce with dhol and sweets.
— Jaag India (@thejaagindia) April 5, 2026
Pranita Sharma welcomed home after legal separation; father, a retired judge, led celebration showing support.#JaagIndia#Breaking#Meerut#UttarPradesh#ViralVideo#SocialChangepic.twitter.com/vQDdRrvw75
ప్రణిత సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. ప్రస్తుతం ఓ అకాడమీలో ఆమె ఫైనాన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. విడాకులు మంజూరైన వేళ ఆమె భావోద్వేగానికి గురైంది. అత్తింట్లో వేధింపులు ఎదురైతే అస్సలు మౌనంగా ఉండకూడదని ప్రణిత ఇతర మహిళలకు సూచించింది. అలాగే తల్లిదండ్రులు తమ కూతుళ్ల పెళ్లి విషయంలో తొందరపడకూడదని చెబుతోంది. వాళ్లని బాగా చదివించి.. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేసిన తర్వాతే పెళ్లి చేయించాలని అంటోంది. అయితే తన విడాకుల విషయంలో తండ్రి ఇచ్చిన ఈ సపోర్ట్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ప్రణిత చెబుతోంది.
Follow Us