BREAKING: RBI సంచలన నిర్ణయం.. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 'పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్' లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

New Update
Reserve Bank of India cancels licence of Paytm Payments Bank Limited

Reserve Bank of India cancels licence of Paytm Payments Bank Limited

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 'పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్' లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ బ్యాంక్ కార్యకలాపాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే నియంత్రణ నిబంధనలు పాటించడంలో ఈ బ్యాంక్ పదే పదే విఫలమయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ ఈ కఠినమైన చర్యలు చేపట్టింది. 

ఇంతకుముదు ఈ బ్యాంకుకు సంబంధించిన కీలక కార్యకలాపాలను నిలిపివేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న లావాదేవీల సెటిల్‌మెంట్‌ను పూర్తి చేయాలని గతేడాది మార్చి 15కు RBI గడువు విధించింది. కానీ ఈ గడువు ముగిసిన తర్వాత కూడా నిబంధనలు అమలు చేయడంలో ఎలాంటి మార్పులు రాలేదు. అందుకే RBI  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని లైసెన్స్ రద్దు కావడంతో ఈ సంస్థ ఇకనుంచి ఎలాంటి బ్యాంకింగ్ సేవలు నిర్వహించలేదు.  

లైసెన్స్‌ రద్దు కావడం వల్ల పేమెంట్స్ బ్యాంక్ ఫ్రేమ్‌వర్క్ కింద పేటీఎం నిర్వహిస్తున్న బ్యాంకింగ్ బిజినెస్ కూడా మూతపడింది. వాలెట్లు, డిపాజిట్లు, ఇతర బ్యాంకింగ్ లావాదేవీలపై RBI విధించిన ఈ ఆంక్షలు పేటీఎం సంస్థపై, అలాగే దాన్ని నమ్ముకున్న వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. అయితే నిబంధనల విషయంలో ఎలాంటి సంస్థనైనా ఉపేక్షించేది లేదని RBI తన చర్యలతో మరోసారి స్పష్టం చేసింది. 

Advertisment
తాజా కథనాలు