/rtv/media/media_files/2026/05/15/petrol-and-diesel-prices-hiked-2026-05-15-11-11-23.jpg)
Petrol, Diesel prices hiked
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి(Crude Oil Prices Spike). దీంతో దేశీయ చమురు సంస్థలు కూడా దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. BPCL, HPCL, IOCL సంస్థలు లీటరుకు రూ. 3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం(global oil prices) తో వాహనదారులపై భారం పడింది.శుక్రవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడం, ముడిచమురు కొనుగోలు వ్యయం విపరీతంగా పెరగడమే ఈ ధరల పెంపు నిర్ణయానికి ప్రధాన కారణం. ఏప్రిల్ 2022 తర్వాత ఇంధన ధరల్లో ఇలాంటి పెద్ద మార్పు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ధరలు ఎందుకు పెంచారు ?
ప్రస్తుత సంక్షోభం వల్ల చమురు కంపెనీలకు రోజుకు సుమారు రూ.1,000 కోట్ల నష్టం వస్తోంది. ఒకవేళ ఈ చమురు ధరలు పెంచకుంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ మూడు కంపెనీల ఉమ్మడి నష్టాలు రూ. 1.25 లక్షల కోట్లకు చేరే ముప్పు ఉందని నిపుణులు అంచనా వేశారు. ముడిచమురు ఉత్పత్తి వ్యయానికి, విక్రయ ధరకూ మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించేందుకే కంపెనీలు ఇంధన ధరలు పెంచాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
Also Read: అమెరికా పతనం అంచులో ఉందన్న జిన్‌పింగ్.. ఒప్పుకున్న ట్రంప్..
అయితే లీటరుకు రూ.3 పెంచడం కంపెనీల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా 50 పైసల పెంపు ఉంటేనే ఐఓసీఎల్, బీపీసీఎల్ లాంటి సంస్థల లాభాలు 7 నుంచి 11 శాతం వరకు పెరుగుతాయి. అయితే ఇప్పుడు రూ.3 అంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా పెంచడం వల్ల హెచ్‌పీసీఎల్ లాంటి సంస్థలకు కూడా లాభం చేకూరనుంది. అయితే ఈ ధరల పెరుగుదల కంపెనీల ఆర్థిక లోటును పూర్తిగా పూడ్చలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని భావిస్తున్నారు.
చమురు కంపెనీలను నష్టాల నుంచి పూర్తిగా ఉపశమనం కావాలంటే పెట్రోల్‌పై రూ. 28, డీజిల్‌పై రూ. 32 వరకు పెంచాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంధన ధరల్లో చూసుకుంటే 30 శాతం పైగా లోటు ఉన్నట్లు సమాచారం. గతంలో 2022లో మొదలైన రష్యా- ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా 16 రోజుల్లో 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఒకవేళ ఇరాన్ యుద్ధం మరింత కాలం ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత ప్రియమయ్యే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: ఢిల్లీలో వర్క్ ఫ్రం హెం.. సీఎం రేఖా గుప్తా 10 కీలక ప్రకటనలు
Follow Us