విమాన ప్రయాణికులను కాపాడిన రియల్ హిరోయిన్స్.. తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్‌పోర్టులో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన పైలట్లుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహిళా పైలట్ మైత్రీ శ్రీకృష్ణ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Oct 2024 in నేషనల్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్‌పోర్టులో శుక్రవారం సాయంత్రం షార్జాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 2 గంటల పాటు ఆ ఫ్లైట్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అవుతుందా లేదా అనేదానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠతో ఎదురుచూశారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య రావడంతో ఈ ఇబ్బంది తలెత్తింది. ఎమర్జెన్సీ సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావాలంటే అందులో ఉండే ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందులో ఉండే పైలట్లు చాకచక్యంగా తమ పనితనాన్ని ప్రదర్శించి ఇంధనాన్ని తగ్గించి రాత్రి 8.15 PM గంటలకు విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. విమానాన్ని నడిపిన పైలట్ ఇక్రోమ్ రిఫడ్లీ ఫాహ్మీ జినాల్, అలాగే కో పైలట్ మైత్రీ శ్రీకృష్ణ షితోల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 141 మంది ప్రాణాలను కాపాడిన రియల్ హిరోస్ అంటూ కొనియాడుతూ రాజకీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు పోస్టులు పెట్టారు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన తర్వాత ఎయిర్‌పోర్టులో ఈ ఇద్దరు పైలట్లు నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి.ముఖ్యంగా మహిళా పైలట్ అయిన మైత్రీ శ్రీకృష్ణను కూడా రియల్ హిరోయిన్ కంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఓ మహిళా పైలట్‌గా ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరుపై సెల్యూట్ చేస్తున్నారు. Also Read: 20 స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ గతంలో కూడా మహిళా పైలట్లు, మహిళా ఎయిర్ హోస్టెస్‌లు ఇలా ఎమర్జెన్సీ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.1986లో ముంబయి నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్న విమానాన్ని కొందరు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ తర్వాత ఈ విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఇలాంటి భయానక సందర్భంలో నిర్జా భానోత్ అనే మహిళా ఎయిర్ హోస్టెస్ తన ధైర్య సాహసాన్ని ప్రదర్శించారు. తన కాక్‌పిట్ సిబ్బందిని రహస్యంగా అప్రమత్తం చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్సిట్ నుంచి తప్పుంచుకునేలా సాయం చేసింది. మొత్తంగా 350 మందికి పైగా విమాన ప్రయాణికులను నిర్జా భానోత్ సురక్షితంగా రక్షించింది. ఇంతటి ధైర్య సాహసాన్ని ప్రదర్శించి ప్రయాణికలను కాపాడినందుకు గానూ అప్పట్లో ఆమె పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసించారు. ధైర్య సాహసాలు కనబరినందుకు ఇచ్చే భారత అత్యున్నత పౌర పురస్కారమైన 'అశోక చక్ర' అవార్డుతో పాటు మరికొన్ని అవార్డులు కూడా నిర్జా భానోత్ మరణాంతరం వచ్చాయి. గతంలో పలువురు మహిళా పైలట్లు ఎమర్జెన్సీ సమయంలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ప్రశంసలు అందుకున్నారు. అమిలా, అమేలియా ఇయర్‌హార్ట్, జెస్సికా కాక్స్, షానన్ ఫాక్స్, బెస్సీ కోల్మన్, కెప్టెన్ టామీ జో షల్ట్స్, జిల్ లాంగ్.. ఈ మహిళా పైలట్లందరూ కూడా తమ ధైర్య సాహాసాలు కనబర్చి విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పారు. Also Read: తమిళనాడు రైలు ప్రమాదం..18 రైళ్లు రద్దు! ఇక 2016లో యూరప్‌లోని బెల్జియం రాజధాని బ్రెసెల్స్ ఎయిర్‌పోర్టులో, అలాగే మెట్రో స్టేషన్‌లో ఐసిస్ ఉగ్రవాదుల దాడులు జరిగాయి. టెర్రరిస్టులు బాంబులు పేల్చారు. ఈ విషాద ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలా గాయాలపాలైన వారిలో ఇండియాకి చెందిన ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లలో అమిత్ మోత్వానితో పాటు మహిళా ఎయిర్ హోస్టెస్ నిధి చాపేకర్ ఉన్నారు. రక్తంతో తడిసిపోయిన నిధి చాపేకర్ ఫొటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఈ ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రే ఫర్ నిధి చాపేకర్ అంటూ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యింది. చివరికి వీళ్లిద్దరూ సురక్షింతంగా ఇండియాకు చేరుకున్నారు. #telugu-news #pilot #air-hostes #hero #air india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి