అత్యాచార నిందితుడికి పూల దండలతో ఘనస్వాగతం.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలు నుంచి రిలీజ్ కావడంతో పూలదండలతో ఘనస్వాగతం పలకడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

New Update
Rape Accused Welcomed with Garlands in uttarpradesh

Rape Accused Welcomed with Garlands in uttarpradesh

ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలు నుంచి రిలీజ్ కావడంతో పూలదండలతో ఘనస్వాగతం పలకడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి . మే 17న ఈ విచిత్రమైన ఘటన జరిగింది. ఓ అత్యాచారం కేసులో సుశీల్ ప్రజాపతి అనే నిందితుడు తొమ్మిది నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో అతడి అనుచరులు జైలు గేటు వద్దే ఘనంగా స్వాగతం పలికారు. మెడలో పూలదండలు వేయడం, కాళ్లకు మొక్కడం, చివరకు భుజాలపై ఎక్కించుకుని ఊరేగించడం లాంటి చర్యలతో నానా హంగామా చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు  దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ 18 నగరాల్లో వాటర్ మెట్రో.. ఛార్జీ ఎంత? ఎలా పని చేస్తుందో తెలుసా?

అయితే నిందితుడు సుశీల్‌ ప్రజాపతి గతంలో 'హిందూ యువ వాహిని' సంస్థలో సభ్యుడిగా ఉండేవాడు. ఓ న్యాయవిద్యార్థినికి లాయర్‌ను పరిచయం చేస్తాననే సాకుతో ఆమెను నమ్మించి ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై రేప్ చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి 9 నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి సమాజంలో హీరోలా ఊరేగింపు నిర్వహించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు