/rtv/media/media_files/2025/03/26/2naBEjY4UbpbTusW9Naj.jpg)
Rana Sanga Row Photograph: (Rana Sanga Row)
ఎంపీ ఇంటిపైకి రాళ్లు, కర్రలతో వెళ్లిన ఓ గ్యాంగ్ బుధవారం మూకుముడిగా దాడి చేసింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్ హింస చెలరేగి నెల రోజులు కాకముందే.. ఆగ్రాలో మరో హింస చోటుచేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకోడానికి ప్రయత్నించడగా ఆందోళనకారులు పోలీసులపైకి తిరగబడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంజీ లాల్ సుమన్ ఇంటిపై బుధవారం ఓ గ్యాంగ్ దాడి చేసింది. కర్ణి సేన అనే మితవాద సంస్థ సభ్యులు ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని ఆపినప్పుడు పోలీసులపై హింసకు దిగారు. దీంతో అక్కడ లాఠీ ఛార్జ్ చోటుచేసుకుంది.
#WATCH | Agra, UP: Vandalism and stone pelting broke outside the residence of Samajwadi Party MP Ramji Lal Suman. Police try to disperse the crowd and bring the situation under control.
— ANI (@ANI) March 26, 2025
(Note: Abusive language) pic.twitter.com/ocsKqkgUJD
16వ శతాబ్దపు నాటి రాజ్‌పుత్ వంశానికి చెందిన రాజు రాణా సంగ బాబర్‌ను భారత దేశానికి ఆహ్వానించినించాడు కాబట్టే ఇక్కడ మొగల్ రాజ్యస్థాపన జరిగిందని సవాజ్‌వాదీ ఎంపీ అన్నారు. రాణా సంగను ఎంపీ రాంజీ లాల్ సమన్ దోశద్రోహి అని అన్నారు. రాజ్యసభ సభ్యుడు చేసిన వివాదాస్పద ప్రకటనల కారణంగా హింస జరిగింది. బాబర్ జ్ఞాపకాలైన బాబర్‌నామాలో రాసిన దాని ఆధారంగా ఆయన అలా మాట్లాడానని అంటున్నారు. ఎంపీ వ్యాఖ్యలను వ్యతిరేఖిస్తూ కర్ణిసేన సభ్యులు కొందరు కాషాయ జెండాలు, కర్రలతో ఆయన ఇంటిపైకి దాడికి వెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై విరుచుకపడి గాయపరిచారు. ఆందోళనకారులు హింసకు చెలరేగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్లు విసిరారు, కుర్చీలు విరగ్గొట్టారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో హింస సర్థుమనిగింది.
#WATCH | Agra, UP: Stone pelting at the residence of Samajwadi Party MP Ramji Lal Suman, window panes broken and vehicles parked outside vandalised. More details awaited. pic.twitter.com/AnUnojnBkl
— ANI (@ANI) March 26, 2025
ఓ నేషనల్ మీడియాతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంజీ లాల్ సుమన్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక చారిత్రక వాస్తవం. ఈ రోజుల్లో భారతీయ ముస్లింలకు బాబర్ DNA ఉందని చెప్పడం సర్వసాధారణమైంది... కానీ నిజం ఏమిటంటే వారు అతన్ని తమ నాయకుడిగా పరిగణించరు. బాబర్ మతంతో రాలేదు.. అతను కత్తితో వచ్చాడు. భారతీయ ముస్లింల ఆదర్శాలు సూఫీ సాధువుల సంప్రదాయాలలో పాతుకుపోయాయి" అని అన్నారు.
Also read: Spam block: 7 లక్షల SIM కార్డ్స్, 83 వేల వాట్సాప్ అకౌంట్లు బ్లాక్ చేసిన ఇండియన్ గవర్నమెంట్
" బాబర్‌ను 'విదేశీ ఆక్రమణదారుడు' అని పిలవడం చాలా సులభం.. కానీ అతన్ని ఎవరు ఆహ్వానించారు? 'బాబర్‌నామా'తో సహా రికార్డుల ప్రకారం.. రాణా సంగ బాబర్‌ను ఇబ్రహీం లోడిపై పోరాడటానికి ఆహ్వానించాడు. తరువాత, పరిస్థితి మారిపోయింది మరియు రాణా సంగ స్వయంగా ఖాన్వా యుద్ధంలో బాబర్‌తో పోరాడాడు." అని చరిత్ర గుర్తు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. యూపీలో బీజేపీ, సవాజ్ వాదీ పార్టీల మధ్య వాదనలు జరిగాయి.