BIG BREAKING: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్‌ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఎ‍న్నికలు జరగనుండగా ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

New Update
BREAKING

BREAKING

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్‌ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు ఎ‍న్నికలు జరగనున్నాయి. ఏపీలో 4 స్థానాలకు, గుజరాత్ 4, జార్ఖండ్ 2, మధ్యప్రదేశ్‌ 3, కర్ణాటక 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్8న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. జూన్ 9న నామినేషన్లు పరిశీలించనున్నారు. జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. పోలింగ్ రోజునే ఫలితాలను వెల్లడించనున్నారు.  

Advertisment
తాజా కథనాలు