BIG BREAKING: తాగి అసెంబ్లీకి వచ్చిన పంజాబ్ సీఎం?.. వీడియో వైరల్

పంజాబ్ అసెంబ్లీలో 'మే డే' సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సీఎం భగవంత్ మాన్ మద్యం తాగి సభకు వచ్చినట్లు శిరోమణి అకాలీ దళ్ (SAD) ఆరోపించింది.

New Update
Punjab CM Bhagwant Mann’s Speech Row, Opposition parties Alleges Drunk CM

Punjab CM Bhagwant Mann’s Speech Row, Opposition parties Alleges Drunk CM

పంజాబ్ అసెంబ్లీలో 'మే డే' సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సీఎం భగవంత్ మాన్ మద్యం తాగి సభకు వచ్చినట్లు శిరోమణి అకాలీ దళ్ (SAD) ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఎక్స్‌లో షేర్ చేసింది. పవిత్రమైన అసెంబ్లీ భవనానికి సీఎం ఇలాంటి స్థితిలో రావడం సిగ్గుచేటని విమర్శించింది. మాన్ ప్రవర్తనను తీవ్రంగా ఖండించిన అకాలీ దళ్ పార్టీ.. పంజాబ్ ప్రజల సమక్షంలో ఆయనకు వెంటనే డ్రగ్ టెస్ట్ నిర్వహించాలంటూ డిమాండ్ చేసింది.

Also Read: అమ్మ ప్రేమంటే ఇది.. కన్నకొడుకును కౌగిలించుకుని ప్రాణాలు వదిలిన తల్లి

మరోవైపు కాంగ్రెస్ సైతం సీఎంపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన విపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా మాట్లాడుతూ  సీఎం మద్యం సేవించినట్లు ఆరోపణలు రావడం వల్ల వాస్తవాలను నిర్ధారించేందుకు అసెంబ్లీలోని ఎమ్మెల్యేలందరికీ ఆల్కహాల్ పరీక్షలు చేయాలని కోరారు. మరో కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ రాజా స్పందిస్తూ ప్రభుత్వ పదవీకాలం ముగియనున్న దశలో ఇలాంటి మీటింగ్‌లు ఏర్పాటు చేయడం వల్ల కార్మికులకు వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. 

Also Read: బిగ్ షాక్..  కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెంపు!

ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘన్‌ చద్దా సహా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్లిష్ట సమయంలో అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మీటింగ్‌లో సీఎం భగవంత్‌ మాన్‌పై మద్యం సేవించినట్లు ఆరోపణలు రావడం దుమారం రేపుతోంది. అధికార, విపక్ష నేతలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.  

Advertisment
తాజా కథనాలు