Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమె ఇంట్లో దేవుడికి హారతి ఇస్తుండగా ఆమె చున్నీకి మంటలు అంటుకున్నాయి.కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు.

New Update
girija

girija

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ ఆమె నివాసంలోనే అగ్ని ప్రమాదానికి గురయ్యారు. ఇంట్లో పూజ చేసుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగింది. దేవుడికి హారతి ఇచ్చేందుకు పైకి లేవగా... ఆమె చున్నీకి దీపం అంటుకుని మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే అవి ఒళ్లంతా వ్యాపించి బట్టలన్నీ కాలిపోయాయి. ఆమె అరుపులతో పూజ గదికి వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే వాటిని ఆర్పేశారు. ఆమెను వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అహ్మాదాబాద్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!

రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ నివాసంలో ప్రతి రోజూ లాగే పూజ కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ పూజా చేసుకుంటున్నారు.  హారతి ఇచ్చేందుకు పైకి లేచి ఇస్తుండగా.. కింద ఉన్న దీపం ఆమె బట్టలకు అంటుకుంది.ఆమె మంటలను గుర్తించేలోపే ఒళ్లంతా అంటుకున్నాయి.దీంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఆమె సోదరుడు గోపాల్ కృష్ణ వర్మ.. వెంటనే లోపలికి వచ్చారు. నీళ్లు, టవల్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆపై వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. మెరగైన చికిత్స కోసం ఆమెను అహ్మాదాబాద్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. 

Also Read: Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి

దీంతో వెంటనే ఆమెను ఆహ్మాదాబద్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. గిరిజా వ్యాస్ రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మరియు మహిళా కమిషన్ జాతీయ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అలాగే ఆమె ఇండియా కాంగ్రెస్ కమిటీ మౌత్ పీస్ సందేశ్ పాత్‌ర్కాకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. 1986 నుంచి 1990 వరకు రాష్ట్ర పర్యాటకశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఏఐసీసీ సభ్యురాలిగా ఏడాది పాటు ఉన్నారు. 1991లో ఉదయ్‌పూర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 

Also Read: Temperature: ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇండియాలో దబిడి దిబిడే.. IMD వార్నింగ్

Also Read: BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు

alahabad | girijavyas | former minister | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment